కోటు, టైతో పని కాదు..
బాధ్యతగా పనిచేయాలి
కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
సాక్షి, విజయవాడ బ్యూరో: బ్రిటిష్ సంప్రదాయంలో కోటు, టై వేసుకుని ఏసీ గదుల్లో పనిచేయడం కాదు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, ఉన్నతాధికారులకు చెప్పారు. పోటీతత్వంతో పనిచేసి రాష్ట్రానికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. గేట్‌వే హోటల్‌లో మంగళవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, నర్సింగ్, ఆటోమొబైల్ రంగాల్లో పనిచేస్తున్న నిరుద్యోగ యువకులకు లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీ, వ్యక్తిత్వ వికాసం, ఆంగ్ల భాషపై ప్రావీణ్యం కల్పించేందుకు ప్రతి జిల్లాలోనూ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కల్పించేందుకు అవసరమైన భవనాలు నిర్మించడానికి స్థలాలు కేటాయించాలన్నారు. రాబోయే రెండేళ్లలో నైపుణ్యం కలిగిన 2.28 లక్షల మంది అవసరం ఉందన్నారు. విద్యుత్ శాఖను మార్గదర్శకంగా తీసుకుని కలెక్టర్లు, శాఖాధిపతులు పనిచేయాలని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ అన్ని ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
గర్భిణుల కోసం 108 వాహనాలను ఐవీఆర్‌ఎస్ విధానానికి అనుసంధానం చేస్తున్నామన్నారు. వైద్య సిబ్బందిని అవసరాన్ని బట్టి ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించుకోవాలన్నారు. త్వరలో ఉపాధ్యాయుల అంతర్‌జిల్లా బదిలీలు చేపడతామని చెప్పారు. ఫిబ్రవరి ఒకటో తేదీకల్లా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులందరికీ రేషన్ కార్డులివ్వాలని సీఎం ఆదేశించారు. చం ద్రన్న సంక్రాంతి కానుకగా తాత్కాలిక కార్డులివ్వాలని సూచించారు. తొలుత అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
మలేసియా ప్రభుత్వంతో ఒప్పందం
పరిపాలనలో వేగం, వృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మలేసియా ప్రధాని అజమాయిషీలో ఉండే పెమాండు(పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ యూనిట్)తో ఒప్పందం కుదుర్చుకుంది. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు, పెమాండు సీఈవో ఇడ్రిస్ జలా స మక్షంలో ఏపీ, మలేషియా ప్రభుత్వ ప్రతి నిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశా రు. అనంతరం పెమాండు సీఈవో జలా.. కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా మాట్లాడుతూ ప్రజెంటేషన్ ఇచ్చారు.