పెద్దపప్పూరు(తాడిపత్రి): పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో మందు బాబులు మంగళవారం వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ శ్రీహర్ష కథనం మేరకు...
పెద్దపప్పూరు(తాడిపత్రి): పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో మందు బాబులు మంగళవారం వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ శ్రీహర్ష కథనం మేరకు... గ్రామానికి చెందిన నారాయణస్వామి, చంద్రశేఖర్ ఇళ్లు పక్కపక్కనే కాగా, తన మిత్రులు గౌడ్, సుధాకర్‌రెడ్డితో కలసి నారాయణస్వామి తన ఇంటి వద్ద మందు తాగుతూ అల్లరి చేస్తున్నట్లుతెలిపారరు. దీంతో అభ్యంతరం తెలిపిన చంద్రశేఖర్ సహా అతని అన్న రాముపై మందుబాబులు దాడికి దిగారు. సుధాకర్‌రెడ్డి చంద్రశేఖర్‌ను కట్టెతో తలపై బాదడంతో తీవ్ర గాయమైం, రక్తస్రావమైంది. దీంతో అతను అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఓ ప్రైవేటు వాహనంలో తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఈ ఉదంతంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గరు మహిళలు, మరో ముగ్గరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.