నేడు ఆకాశవాణిలో ప్రత్యేక కార్యక్రమాలు
Published Sat, Sep 24 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
ఆదిలాబాద్ కల్చరల్ : ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయనున్నట్లు కార్యక్రమ నిర్వహణాధికారి రామేశ్వర్ కేంద్రె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ నుంచి ఉదయం 11 గంటలకు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రతినెల దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో చేసిన ముచ్చట్లు మన్ కీ భాత్ కార్యక్రమం ప్రసారం అవుతుందని, తిరిగి 8గంటలకు తెలుగులో అనువాదం ఉంటుందని చెప్పారు.
ఉదయం 7.15 గంటల నుంచి శణనామ సంస్కతం –సంస్కతాన్ని విందాం అనే కార్యక్రమంలో మహాపండితులు దోర్బల ప్రభాకరశాస్త్రి వాయిపూజ గురించి వివరిస్తారని తెలియజేశారు. సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షురాలు కోటోజు సౌజన్య, ఆమె భర్త కోటోజు చంద్రశేఖర్‌తో ఓ పాటన మధ్య ముచ్చట్లు ఉంటాయని పేర్కొన్నారు. రాత్రి 7.15 గంటల నుంచి 7.45 వరకు ప్రసారం అయ్యే కిసాన్‌వాణి కార్యక్రమంలో జామలో ప్రవర్ధనం అనే అంశంపై ఆదిలాబాద్ ఉద్యానవన పాలిటెక్నిక్ అధ్యాపకుడు రవితో ముచ్చట్లు ఉంటాయని తెలిపారు.
Advertisement
Advertisement