టెలివిజన్ల మూగనోము | all should set the setupbox to their tv | Sakshi
Sakshi News home page

టెలివిజన్ల మూగనోము

Published Fri, Sep 30 2016 12:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

టెలివిజన్ల మూగనోము - Sakshi

టెలివిజన్ల మూగనోము

సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్‌ హైదరాబాద్‌లో పూర్తి స్థాయి డిజిటల్‌ కేబుల్‌ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దశలవారీగా అనలాగ్‌ పద్దతిలో కొనసాగుతున్న ప్రసారాలను నిలిపివేయడంతో సెట్‌టాప్‌ బాక్స్‌ లేని టీవీలు మూగబోయాయి. దీంతో డిజిటల్‌ ప్రసారాల కోసం కేబుల్‌ టీవీలకు సెట్‌టాప్‌ బాక్స్‌ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్‌ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) డిజిటల్‌ పద్దతిలో ప్రసారాల కోసం కేబుల్‌ టీవీలకు సెట్‌ టాప్‌ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

ఇందుకు కోసం నాలుగు విడతలుగా గడువు విధించింది. ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో  కేబుల్‌ టీవీలకు అనలాగ్, డిజిటల్‌ పద్ధతిలో ప్రసారాలకు వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. తాజాగా పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ ప్రక్రియ అమలులో భాగంగా మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్ల (ఎమ్‌ఎస్‌ఓ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేబుల్‌ టీవీలకు అనలాగ్‌ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోగా, కేవలం డిజిటల్‌ ప్రసారాలు మాత్రమే అందుతున్నాయి.

పూర్తి కాని డిజిటలైజేషన్‌...
కాగా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని  కేబుల్‌ టీవీలకు పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్‌ పూర్తి కాలేదు. ఫలితంగా సుమారు 20 శాతం కేబుల్‌ టీవీలు మూగబోయాయి. నగరంలో దాదాపు 2వేల మంది కేబుల్‌ ఆపరేటర్లు ఉండగా వాటి పరిధిలో ∙25 లక్షల టీవీ  కనెక్షన్లకు పైగా ఉన్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎమ్‌సీహెచ్‌) లెక్కల ప్రకారం కేబుల్‌ కనెక్షన్ల సంఖ్యలో సగానికి పైగా వ్యత్యాసం  కనిపిస్తోంది.  అధికారికంగా 10 లక్షలు మాత్రమే నమోదై ఉన్నట్లు సమాచార ప్రసార శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

నగరంలోని మొత్తం టీవీ కనెక్షన్లలో 80 శాతం వరకు డీటీహెచ్‌ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు అంచనా. కేబుల్‌ ప్రసారాలు అందిస్తున్న సిటీ కేబుల్, హత్‌వే, డిజీ కేబుల్, ఆర్‌వీఆర్, భాగ్యనగర్, ఇన్‌ డిజిటల్‌ తదితర సంస్ధలు తమ ఆపరేటర్ల ద్వారా సుమారు 20 లక్షల వరకు సెట్‌టాప్‌ బాక్స్‌లు విక్రయించినట్లు సమాచారం.  దీనిబట్టి మరో 20 శాతం వరకు కేబుల్‌ టీవీలకు సెట్‌టాప్‌ బాక్స్‌లు లేనట్లు తెలుస్తోంది. ప్రతి కేబుల్‌ ఆపరేటర్‌ పరిధిలో సుమారు 200 కనెక్షన్లకు సెట్‌టాప్‌ బాక్స్‌లు లేకపోవడంతో టీవీలు మూగబోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement