setup box
-
అపరిమిత డేటా… 30 రోజులు ఉచితం
విజయవాడ : జియో ఫైబర్ తన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు పట్టణాలకు విస్తరించింది. తెనాలి, హిందూపూర్, బొబ్బిలి లలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 పట్టణాల్లో జియో ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, ‘మొబైల్ కనెక్టివిటీ పరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జియో వేగంగా , విస్తృతంగా దూసుకువెళ్లి నెంబర్ వన్ ఆపరేటర్ గా నిలిచింది. ఇదే పరుగును బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో కూడా కొనసాగించి జియో ఫైబర్‌ను ఈ పట్టణాల్లో ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. 'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అపరిమిత డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే జియోఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ లభిస్తాయి. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం ప్రస్తుత కస్టమర్లను అప్‌గ్రేడ్ చేసి ఆయా ప్రయోజనాలను అందిస్తారు. ఆసక్తిగల కస్టమర్లు ఇక్కడ తమను తాము నమోదు చేసుకోవచ్చు. https://www.jio.com/registration కొత్తగా ప్రకటించిన జియో ఫైబర్ 4 ప్లాన్ల వివరాలు ఇవిగో... Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. -
అంతా సెట్ చేశారు..
- 3 కోట్ల బాక్సుల ఏర్పాటుకు రంగం సిద్ధం - మామూలు సెట్‌టాప్ బాక్స్ ధర రూ.1,500 - కానీ రూ.4 వేలుగా ధర నిర్ణయించిన ప్రభుత్వం సాక్షి, అమరావతి: సర్కారు వారి సెట్ టాప్ బాక్స్‌ల వ్యవహారం చూస్తుంటే ‘చారాణా ముర్గీకో బారాణా మసాలా’ అన్న సామెత గుర్తొస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం టీవీలున్న వారి ఇళ్లలో 90 శాతం సెట్ టాప్ బాక్స్‌లు ఉన్నాయి. ఇప్పటికే రూ.1,500 వెచ్చించి ఆ బాక్స్‌ను కొనుగోలు చేశారు. ఈ స్థితిలో ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ అంటూ.. టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్లను ఒకే కనెక్షన్ ద్వారా ఇస్తామని ఊదరగొడుతూ ముందుకొచ్చింది. ఇందుకోసం ఏర్పాటు చేసే సెట్ టాప్ బాక్స్ కోసం రూ.4 వేలు చెల్లించాలంటోంది. ఇంత సొమ్మును పేద వర్గాల వారు చెల్లించడం ఇప్పటికిప్పుడు అసాధ్యం. ఈ సాకుతో వారిపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ.. రుణ సదుపాయం కల్పిస్తామంటోంది. దీని వెనుక ఉన్న మర్మం.. కిటుకు అంతా ఇక్కడే ఉంది. జనానికందరికీ బ్యాంకుల ద్వారా అప్పులిప్పించాలి.. ఆ సొమ్ములో వేలకోట్లు దండుకోవాలి.. జనం మాత్రం వడ్డీ సహా బ్యాంకులకు అప్పులు చెల్లించాలి.. ఇదే అసలు పథకం!! దీంతోపాటు ప్రసారాలను నియంత్రించే ‘కీ’ని ప్రభుత్వం తమ చేతిలో పెట్టుకుంటుంది. తాను తలచిందే నిజమని జనానికి చూపించనుంది. ఆందోళన కలిగించే కొత్తతరహా బాదుడు కథాకమామిషూ ఇది.. అయినవారికే కాంట్రాక్టులు: వాస్తవానికి సెట్ టాప్ బాక్సుల కుంభకోణం ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుతోనే మొదలైంది. ముఖ్యమంత్రి సమీప బంధువుకు చెందిన ముఖ్యమంత్రి సమీప బంధువుకు చెందిన టెరా సాఫ్ట్వేర్ సంస్థకు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. ఇందులోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కరెంట్ స్తంభాలను ఉపయోగించుకుని 23,500 కి.మీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేశారు. సెట్ టాప్ బాక్స్‌లను ఉపయోగించి టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ అందించే పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ బాక్సులను చైనా తయారు చేస్తోంది. సెట్‌టాప్ బాక్సులను అందించేందుకు చైనా కంపెనీల ప్రతిపాదనలపై చర్చలు జరుగుతుండగానే ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను అమర్ రాజా, యాగా టెక్నాలజీ ప్రతినిధులు కలిశారు. అమర్ రాజా సంస్థ చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతది. యాగా టెక్నాలజీ సంస్థ కూడా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన అధికార పార్టీ నేతది. ఈ రెండు సంస్థలకే సెట్ టాప్ బాక్సుల కాంట్రాక్టు అప్పగించేందుకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రెండు సంస్థలు సెట్‌టాప్ బాక్సులను తయారుచేయవు. చైనా నుంచి విడి భాగాలు తెప్పించి వాటిని అసెంబుల్ (విడిభాగాల కూర్పు) చేస్తాయి. విడి భాగాలపై ఎలాంటి పన్నులూ ఉండవు. అలాంటపుడు బాక్సు ధర రూ. 2వేలను మించే అవకాశమే లేదు. కానీ రూ. 4వేలకు అంటగట్టడానికి ప్రభుత్వం సిద్ధపడడం వెనుక దాదాపు రూ. వెయ్యి కోట్లు చేతులు మారినట్లు వినిపిస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు సాధారణంగా టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసే సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం సహజం. కానీ, సెట్‌టాప్ బాక్సుల సరఫరా కాంట్రాక్టు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిబంధనలను పట్టించుకోలేదు. పైగా అమర్‌రాజా, యాగా టెక్నాలజీలకు సెట్ టాప్ బాక్సుల తయారీపై అవగాహన లేదు. సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించే నిపుణులూ లేరు. అయినా, అయినవారు కాబట్టి వారికే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సెట్ టాప్ బాక్సులకు ఇప్పటికిపుడు రూ.4 వేలు చెల్లించడానికి వినియోగదారులు సిద్ధంగా లేరు. ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ ఫైబర్ కనెక్షన్లు... ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ స్కూల్స్‌తోపాటు సీబీఎస్ఈ స్కూల్స్‌కు ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా సీసీటీవీ సర్వైలెన్స్ వ్యవస్థ, వర్చువల్ క్లాస్రూమ్ వ్యవస్థ, ప్రభుత్వ డ్రోన్స్ వ్యవస్థ, ఏపీ టవర్స్ లిమిటెడ్, ఏపీ స్టేట్ డేటా సెంటర్, పబ్లిక్ వైఫై వ్యవస్థ పనిచేయనున్నాయి. ప్రభుత్వ సర్వీసులను, ప్రభుత్వం చెబుతున్న విషయాలను ఈ వ్యవస్థల ద్వారా ప్రతి ఇంటికి చేరవేయడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. అన్ని వర్సిటీలు, స్వయం ప్రతిపత్తిగల కాలేజీల ప్రాంగణాలకు కూడా వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జిల్లాకో నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 4,500 కోట్ల కుంభకోణం ఇది.. ఇంట్లో కేబుల్ టీవీకి సెట్‌టాప్ బాక్స్ పెట్టాలంటే రూ.1,500 ఖర్చవుతుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రూ.4 వేలకు కొనాలంటోంది. ఇంత ఖర్చు దేనికంటే.. హెచ్డీ క్వాలిటీతో టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ వస్తాయంటోంది. ఇవి రావడానికి బాక్సులో ర్యామ్‌తోపాటు కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మారిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. దీనికి మహా అయితే ఇంకో రూ.వెయ్యి ఖర్చువుతుందని చెబుతున్నారు. సెట్‌టాప్ బాక్సును ప్రభుత్వం రూ.4 వేలకు అంటగట్టాలనుకోవడంతో వినియోగదారుడు అదనంగా రూ.1,500 చెల్లిస్తాడన్నమాట. రాష్ట్రంలో 3కోట్ల కేబుల్ కనెక్షన్లున్నాయి. వీటన్నిటికీ బాక్సులను అంటగడితే రూ.12వేల కోట్లు వస్తాయి. అందులో వాస్తవంగా ఖర్చులు పోగా వినియోగదారుల నుంచి అదనంగా రాబట్టే రూ.4,500 కోట్లు కమీషన్ల రూపంలో చేతులు మారబోతున్నాయి. ఈ ప్రాజెక్టును అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల కంపెనీలకు అప్పగించారు. అంటే జనం నుంచి రాబట్టే అదనపు సొమ్మంతా ఈ రెండు కంపెనీలకు.. అక్కడి నుంచి సర్కారు పెద్దలకు చేరబోతోంది. సర్కారు గుప్పిట్లో ప్రసారాలు విద్య, వైద్యం వంటి ముఖ్యమైన రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు చేయాల్సిన పనిని నెత్తికెత్తుకోవడం పట్ల అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 79% జనాభాకు టెలిఫోన్ సౌకర్యం, 87% మందికి సెల్‌ఫోన్, 27% మందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. అలాగే రాష్ట్రంలో 80% ఇళ్లలో టీవీలకు సెట్ టాప్ బాక్సులతో కేబుల్ నెట్ వర్క్ కనెక్షన్లు ఉన్నాయి. అయినా కొత్తగా రాష్ట్రంలోని ఇళ్లకు ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్‌తో సెట్‌టాప్ బాక్సులను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. ఫైబర్ నెట్ వర్క్ కనెక్షన్‌తోపాటు సెట్‌టాప్ బాక్సులను అమర్చుకుంటే ప్రజలు ఇక సర్కారు చూపించే సినిమాలు, వార్తలే చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తోంది. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఫైబర్ నెట్ వర్క్, సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుకు పూనుకుందని అంటున్నారు. తొలి దశలో పది లక్షల సెట్‌టాప్ బాక్సులను మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎంఎస్ఓల) ద్వారా ఇళ్లకు పంపిణీ చేయించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం రూ. 400 కోట్లు సమీకరించి సెట్ టాప్ బాక్సుల కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలకు అందించింది. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 200 కోట్లను, అలాగే బ్యాంకు నుంచి మరో రూ. 200 కోట్లలను రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి సమీకరించింది. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సెట్‌టాప్ బాక్సులను వినియోగదారులకు పంపిణీ చేయడానికి ఎంఎస్ఓలు విముఖత చూపుతున్నారు. మొత్తం కేబుల్ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవడానికే ఈ సెట్‌టాప్ బాక్సులను తెరపైకి తెచ్చిందని ఎంఎస్ఓలు ఆందోళన చెందుతున్నారు. ఈ సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకున్న వారికి ప్రసారం చేసే నిమిత్తం ఫైబర్ నెట్ వర్క్ లిమిటెడ్.. 5,000 దక్షిణాది, 1,600 హిందీ, 500 ఇంగ్లీషు సినిమాలపై 3 ఒప్పందాలను చేసుకుంది. 4,000 స్కూల్స్, 6,896 పంచాయతీ కార్యాలయాలకు ఫైబర్‌నెట్ వర్క్ కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. -
టెలివిజన్ల మూగనోము
సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో పూర్తి స్థాయి డిజిటల్ కేబుల్ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దశలవారీగా అనలాగ్ పద్దతిలో కొనసాగుతున్న ప్రసారాలను నిలిపివేయడంతో సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి. దీంతో డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్ (ఎస్టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్దతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకు కోసం నాలుగు విడతలుగా గడువు విధించింది. ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో కేబుల్ టీవీలకు అనలాగ్, డిజిటల్ పద్ధతిలో ప్రసారాలకు వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. తాజాగా పూర్తి స్థాయి డిజిటలైజేషన్ ప్రక్రియ అమలులో భాగంగా మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎమ్ఎస్ఓ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేబుల్ టీవీలకు అనలాగ్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోగా, కేవలం డిజిటల్ ప్రసారాలు మాత్రమే అందుతున్నాయి. పూర్తి కాని డిజిటలైజేషన్... కాగా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని కేబుల్ టీవీలకు పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. ఫలితంగా సుమారు 20 శాతం కేబుల్ టీవీలు మూగబోయాయి. నగరంలో దాదాపు 2వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉండగా వాటి పరిధిలో ∙25 లక్షల టీవీ కనెక్షన్లకు పైగా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎమ్సీహెచ్) లెక్కల ప్రకారం కేబుల్ కనెక్షన్ల సంఖ్యలో సగానికి పైగా వ్యత్యాసం కనిపిస్తోంది. అధికారికంగా 10 లక్షలు మాత్రమే నమోదై ఉన్నట్లు సమాచార ప్రసార శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. నగరంలోని మొత్తం టీవీ కనెక్షన్లలో 80 శాతం వరకు డీటీహెచ్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు అంచనా. కేబుల్ ప్రసారాలు అందిస్తున్న సిటీ కేబుల్, హత్వే, డిజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ తదితర సంస్ధలు తమ ఆపరేటర్ల ద్వారా సుమారు 20 లక్షల వరకు సెట్‌టాప్ బాక్స్‌లు విక్రయించినట్లు సమాచారం. దీనిబట్టి మరో 20 శాతం వరకు కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్‌లు లేనట్లు తెలుస్తోంది. ప్రతి కేబుల్ ఆపరేటర్ పరిధిలో సుమారు 200 కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్స్‌లు లేకపోవడంతో టీవీలు మూగబోయాయి. -
సెట్‌టాప్ బాక్సుల గడువు పొడిగింపు
-
సెట్‌టాప్ బాక్సుల గడువు పొడిగింపు
హైదరాబాద్: కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌కు రెండు నెలల గడువు పొడిగిస్తున్నట్లు హైకోర్టు బుధవారం ప్రకటించింది. సెట్‌టాప్ బాక్స్ కోసం (టీవీ డిజిటలైజేషన్‌కు) గతంలో ప్రకటించిన గడువు ఈ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ గడువు మరింత పొడిగించాలంటూ తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 85 శాతం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సెట్ అప్ బాక్స్ సరఫరా చేయలేదని తమ పిటిషన్లో వారు పేర్కొన్నారు. నేడు విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. సెట్‌టాప్ బాక్స్ అమర్చుకోవడానికి రెండు నెలల గడువు పొడిగిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. -
విదేశాల్లోనూ ‘జాదూ’ లీలలు
ఏడేళ్లలో రూ.50 వేల కోట్ల కుంభకోణం? సాక్షి, సిటీబ్యూరో: జాదూ టీవీ విదేశాల్లో కూడా తన స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆయా దేశాల చానళ్ల ప్రసారాలను కూడా పైరసీ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. ఒక దేశం ఛానల్స్‌ను పైరసీ చేసి.. ప్రపంచంలోని ఇతర దేశాలకు జాదూ టీవీ సెటప్‌బాక్స్ వినియోగదారులకు ప్రసారాలు పంపించడమే వృత్తిగా చేసుకుంది. జాదూ టీవీకి అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దుబాయ్‌తో పాటు మరో 11 దేశాల్లో స్థావరాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన 115 ఛానళ్లను పైరసీకి కేంద్రంగా ఉన్న బోయిన్‌పల్లిలోని జాదూ టీవీ స్థావరంపై సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు దాడి చేయడంతో కేవలం ఒక్క స్థావరం మాత్రమే మూతపడింది. ఆయా దేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఏడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగిస్తుండగా... తొలిసారిగా మన పోలీసులకు మాత్రమే చిక్కడం గమనార్హం. ఇతర దేశాల్లో ఉన్న తమ కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతాయని భావించిన జాదూ టీవీ నిర్వాహకులు తమ స్థావరాలను ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలిస్తున్నారని తెలిసింది. జాదూ టీవీ యజమాని సుమిత్‌హౌజా దుబాయి కేంద్రంగా నడుస్తున్న ‘క్లౌడ్‌స్ట్రీమ్ మీడియా’ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. జాదూ-1, జాదూ-2, జాదూ-3 అనే పేర్లతో కూడా కేబుల్ టీవీ ప్రసారాలు చేస్తామని వారి వెబ్సైట్లో వీరు ప్రకటనలు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల ఛానల్స్‌ను పైరసీ చేసిన ఇతను ఏడేళ్లలో సుమారు రూ.50,000 కోట్లు ఆర్జించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా వెనుక మాఫియా హస్తం కూడా ఉండవచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సుమిత్‌హౌజా గురించి సమాచారం అందించాలనుకునే తమను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ మొత్తం కుంభకోణం వెలుగు చూడాలంటే బాధిత దేశాల ఛానల్స్ మోల్కొనక తప్పదు.