అలరించిన అమరావతి వైభవం
రాష్ట్ర పర్యాటకశాఖ, లేపాక్షి హాండిక్రాప్ట్ ఎంపోరియం ఆధ్వర్యంలో కాలచక్ర మ్యూజియంలో నిర్వహిస్తున్న జాతీయ..
అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ, లేపాక్షి హాండిక్రాప్ట్ ఎంపోరియం ఆధ్వర్యంలో కాలచక్ర మ్యూజియంలో నిర్వహిస్తున్న జాతీయ వారసత్వ పరంపర ఉత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏర్పాటుచేసిన కూచిపూడి వారసత్వం, కృష్ణవేణి చరితం, అమరావతి వైభవం నృత్యరూపకాలు ఎంతగానో అలరించాయి. తొలుత పర్యాటకశాఖ సలహాదారుడు ప్రొఫెసర్ గల్లా అమరేశ్వర్ అధ్వర్యంలో దేశవిదేశ ప్రతినిధులతో అమరావతి వారసత్వ సంపద పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అమరావతిలో భవిష్యత్ తరాలకు అదించాల్సిన వారసత్వ సంపద ఉందని చెప్పారు. ప్రస్తుతం పర్యాటక శాఖ అధ్వర్యంలో సేకరిస్తున్నామని ఈ వారసత్వ సంపద గురించి ప్రపంచానికి తెలియచేయటానికి కృషి చేస్తున్నామని తెలిపారు. భారతీయ సాంప్రదాయాలలో నృత్య, సంగీత రీతులు ఎంతో చారిత్రకమైనవని ఇవినేటికి ప్రజలను అలరిస్తున్నాయన్నారు. నాట్యాచార్య కాజా వెంకట సుబ్రమణ్యం నేతృత్వంలో గుంటూరుకు చెందిన సాయి మంజీర అర్ట్స్ అకాడమీ కళకారులచే కూచిపూడి వారసత్వం, కృష్ణవేణి చరితం, అమరావతి వైభవం నృత్యరూపకాలు ప్రదర్శించారు. కూచిపూడి నృత్య ప్రత్యేకతను దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు గల్లా అమరేశ్వర్ వివరించారు. ధాన్యకటక బుద్ధ విహర ట్రస్టు చైర్మన్ డాక్టర్ వావిలాల సుబ్బారావు, పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉమామహేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.