ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తిర్యాని గ్రామంలో కుటుంబ కలహాలతో సోమేశ్(30) అనే యువకుడు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమేశ్ ఐటీడీఎలో అవ్వల్ అంబులెన్స్ డ్రైవర్‌గా విధులు నిర్వహించేవాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే సోమేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.