బయటపడ్డ పురాతన మండపం | ancient mandap revealed | Sakshi
Sakshi News home page

బయటపడ్డ పురాతన మండపం

Published Tue, May 16 2017 11:04 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

బయటపడ్డ పురాతన మండపం - Sakshi

బయటపడ్డ పురాతన మండపం

శ్రీశైలం: శ్రీశైలం జలాశయం నుంచి కొన్ని రోజుల కిత్రం రివర్‌ స్లూయిస్‌గేటు ద్వారా నీటివిడుదల చేయడంతో పాతాళగంగలో మునిగి ఉన్న పురాతన విశ్రాంతి మండపం మంగళవారం పూర్తిగా బయటపడింది. ఈ మండపాన్ని  క్రీ.శ. 1393–96 మధ్య కాలంలో విఠలాంబ నిర్మించినట్లు చారిత్రక అధారాలు ఉన్నాయి.   ఒకప్పుడు పాతాళగంగలో భక్తులు స్నానాలాచరించడానికి వీలుగా మెట్ల మార్గాన్ని విఠలాంబా నిర్మించారని తెలుస్తోంది.  పాతమెట్ల మార్గాన్ని రెడ్డిరాజులు నిర్మించగా..ఎంతో లోతైన ప్రదేశం కావడంతో మార్గమధ్యలో విశ్రమించడానికి వీలుగా ఈ మండపాలను నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. డ్యాం నిర్మాణంలో భాగంగా అనేక మండపాలు, కట్టడాలు మునిగిపోయాయి. కొన్నింటిని మాత్రమే పునర్నిర్మించడానికి ఆ నిర్మాణపు రాళ్లను పాతాళగంగ మెట్ల పై భాగానికి  చేర్చారు. అవి కూడా తిరిగి పునర్నిర్మాణానికి నోచుకుండానే అక్కడక్కడ ఏర్పాటు చేసిన రాతిస్థంభాలుగా మిగిలిపోయాయి.
 
 ప్రస్తుతం పాతాళగంగ నీటిమట్టం తగ్గిపోవడంతో బయటపడ్డ ఈ మండపం సుమారు 1990–95 మధ్యకాలంలో బయటపడింది. ఆ సమీపంలో ఉన్న వీరభద్రుడి విగ్రహాన్ని దేవస్థానం నీటి సరఫరా విభాగం వారు మెట్ల పై భాగానికి చేర్చి పునఃప్రతిష్టించారు. తిరిగి సుమారు 20 ఏళ్ల తరువాత గత ఏడాది ఇదే నెలలో ఈ మండపం బయటపడింది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటిమట్టం 775 అడుగులకు చేరుకోవడంతో మండపం పూర్తిస్థాయిలో బయటపడిందని స్థానికులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement