పాతాళగంగలో మునిగి యువకుడి మృతి | Youth drowns in pond at Temple | Sakshi
Sakshi News home page

పాతాళగంగలో మునిగి యువకుడి మృతి

Published Sat, May 7 2016 5:15 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

Youth drowns in pond at Temple

శ్రీశైలం (కర్నూలు జిల్లా) : శ్రీశైలం పాతాళగంగలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. హైదరాబాద్ నుంచి శనివారం నలుగురు యువకులు శ్రీశైలం వెళ్లారు. వారు దైవ దర్శనం అనంతరం పాతాళగంగలో ఈత కొడుతుండగా ఓంకార్(20) అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.

ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఓంకార్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. మృతుడు హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన వాడని అతని స్నేహితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement