
రైతులు త్యాగం చేయకతప్పదు: వెంకయ్య
విజయవాడ: అభివృద్ధి కోసం రైతులు త్యాగం చేయక తప్పదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గన్నవరం విమానాశ్రయం కొత్త టెర్మినల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ భూ సేకరణను పెద్ద సమస్యగా చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. భవిష్యత్లోనూ భూసేకరణ వేగవంతంగా జరగాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దార్శనికతను వెంకయ్య అభినందించారు.