
హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్‌గా అంకం విజయ
కర్నూలు(అర్బన్): రెండు తెలుగు రాష్ట్రాల ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఉమెన్స్ వింగ్ కో ఆర్డినేటర్‌గా కర్నూలుకు చెందిన అంకం విజయను నియమించారు. ఈ మేరకు ఏఐహెచ్‌ఆర్‌ఏ దక్షిణాది రాష్ట్రాల చీఫ్ లయన్ జే అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. యునైటెడ్ నేషన్స్ అనుబంధంగా పనిచేస్తున్న తమ సంస్థ కార్యాకలాపాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోను విస్తరించనున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచి మహిళా హక్కులు, సమస్యలపై అవగాహన ఉండటంతో పాటు వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఆమె కృషి చేస్తారనే నమ్మకంతో అంకం విజయను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 1991లో జిల్లా సంపూర్ణ అక్షరాస్యత కోఆర్డినేటర్‌గా పని చేయడంతో పాటు మహిళా సమస్యల పరిష్కారంలో ముందున్న కారణంగా తనకు ఈ పదవిని అప్పగించారని ఆమె శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా మహిళా హక్కులను కాపాడేందుకు కృషి చేస్తానని తెలిపారు.