వసంత మండపంలో పవిత్రోత్సవాలకు అంకుర్పాణ చేస్తున్న అర్చకులు
సాక్షి,తిరుమల: తిరుమల ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం నిర్వహించే పవిత్రోత్సవాలకు శనివారం శాస్రోక్తంగా అంకురార్పణతో ఆరంభించారు. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసనాధారాలు ఉన్నాయి. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఉత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ ఏటా శ్రావణ మాసంలో మూడు రోజులపాటు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. ఆదివారంæనుంచి ఈనెల 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక ఉత్సవం నిర్వహిం^è నున్నారు.
ఇందులో భాగంగా రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాపతి విష్వక్సేనుడిని ఊరేగింపుగా ఆలయం వెలుపల వసంత మండపంలో వేంచేపు చేశారు. తర్వాత వైఖానస ఆగమోక్తకంగా మృత్సంగ్రహణం, అంకురార్పణం, ఆస్థానంతో కార్యక్రమాన్ని వైదికంగా పూర్తి చేశారు.
ఇక తొలిరోజు ఆదివారం శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి పవిత్రోత్సవ మండపం వేంచేపు చేసి పట్టు పవిత్రాలను ( పట్టుదండలు) యాగశాలలో ప్రతిష్టించి హోమాలు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. రెండోరోజు సోమవారం పట్టు పవిత్రాలు సమర్పించనున్నారు. చివరి రోజు మంగళవారం పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగిస్తారు. ఈ ఉత్సవం కారణంగా ఆదివారంæనుంచి ఈనెల 16వ తేదీ వరకు ఆయా రోజుల్లో నిర్వహించే విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు.
పవిత్రోత్సవాలు అపవిత్రమయ్యాయి
తెలిసో, తెలియక జరిగిన దోషాల నివారణ కోసం చేసే పవిత్రోత్సవాలు దోçషం ఉన్న అర్చకుడితో నిర్వహించటం మరింత దోషం అవుతుంది. అరిష్టాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్యక్రమాన్ని నిర్వహించే సీతారామాచార్యులు అత్తకు కర్మకాండలు నిర్వహించి రెండు నెలలు కూడా గడవక ముందే ఆయనతో పవిత్రోత్సవాలు నిర్వహించటం శాస్త్ర విరుద్ధం. దీనిపై ఆలయ అధికారులకు ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పవిత్రోత్సవాలు మరింత అపవిత్రం అవుతాయి. జరగబోయే అరిష్టాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
–మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు విమర్శ