అన్నపూర్ణయ్య ఆస్తులు చాంతాడంత
అన్నపూర్ణయ్య ఆస్తులు చాంతాడంత
Published Wed, Jul 19 2017 12:32 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
కొనసాగిన ఏసీబీ తనిఖీలు
బ్యాంకు లాకర్ తెరిచిన అధికారులు
400 గ్రాముల ఆభరణాలు, అరకిలో వెండి స్వాధీనం
ఏలూరు అర్బన్ : వసతిగృహ అధికారి రావిపాటి అన్నపూర్ణయ్య అక్రమ ఆస్తుల చిట్టా మంగళవారం మరింత పెరిగింది. ఏలూరు ఏసీబీ అధికారులు సోమవారం జిల్లా కేంద్రం ఏలూరులోని సాంఘిక సంక్షేమ శాఖ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో గ్రేడ్1 అధికారిగా పనిచేస్తున్న అన్నపూర్ణయ్య ఇంటిపై దాడులు చేసి స్థిరాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్‌లు, బంగారు, వెండి నగలు, నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఆయన ఇంటిలో దొరికిన బ్యాంకు లాకరు కీతో ఏసీబీ అధికారులు మంగళవారం స్థానిక అంబికా థియేటర్ రోడ్డులోని ఎస్‌బీఐ బ్రాంచి కార్యాలయంలోని లాకరు తెరిచి బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ లాకరు నుంచి అన్నపూర్ణయ్య దాచిన 391.2 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు అర కిలో వెండి వస్తువులు స్వా«ధీనం చేసుకున్నామని చెప్పారు. వాటి విలువ రూ.10 లక్షలకు పైబడి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. తనిఖీల్లో సీఐలు, యు.విల్సన్, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement