మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి | annavaram masterplan | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి

Published Sat, Jul 23 2016 9:06 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

annavaram masterplan

పనులు త్వరితగతిన ప్రారంభం కావాలి
అన్నవరం దేవస్థానం అధికారులకు కన్సల్టెంట్‌ సూచన
అన్నవరం :
మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని అన్నవరం దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌ రూపకర్త, హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్‌ డిజైన్స్‌ నిర్వాహకుడు రాఘవప్రసాద్‌ అధికారులను కోరారు. శనివారం రత్నగిరికి విచ్చేసిన ఆయన స్వామివారిని దర్శించి  పూజలు చేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్, ఈవో కె.నాగేశ్వరరావుతో కలసి సత్యగిరి, రత్నగిరులను పరిశీలించారు. మాస్టర్‌ప్లాన్‌లో చేర్చిన వివిధ నిర్మాణాలకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. సత్యగిరిపై రూ.2.80 కోట్లతో నిర్మించతలపెట్టిన స్మార్త, ఆగమ పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని, రూ.9 కోట్లతో నిర్మించతలపెట్టిన అన్నదాన భవనం స్థలాన్ని పరిశీలించారు. అన్నదాన భవన స్ధలంలో ప్రస్తుతం ఉన్న పాత సెంటినరీ కాటేజీని త్వరలో కూల్చివేయడానికి టెండర్లు పిలుస్తున్నట్లు ఈఓ ఆయనకు తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌ వివరాలను చైర్మన్‌కు రాఘవ ప్రసాద్‌ వివరించారు. వారి వెంట దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈ రామకృష్ణ తదితరులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement