జగన్ దీక్షను పట్టించుకోకపోవడం శోచనీయం | AP CPI Secretary K.Ramakrishna takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

జగన్ దీక్షను పట్టించుకోకపోవడం శోచనీయం

Published Sat, Oct 10 2015 1:28 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

AP CPI Secretary K.Ramakrishna takes on chandrababu naidu

కడప : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగు రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం సీపీఐ చేపట్టిన పాదయాత్ర శనివారం కడప చేరింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... చంద్రబాబు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 22వ తేదీన రాజధాని శంకుస్థానకు వస్తున్న ప్రధాని మోదీపై అఖిల పక్షం తరఫున ప్రత్యేక హోదాపై ఒత్తిడి తీసుకోద్దామని ప్రతిపక్ష పార్టీలకు రామకృష్ణ సూచించారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ... ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అక్టోబర్ 8వ తేదీన అనంతపురంలో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఈ నెల 20న శ్రీకాకుళం జిల్లాలో పూర్తి కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement