బోధనాసుపత్రిగా మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి | Appendix to the orders the Medical College | Sakshi
Sakshi News home page

బోధనాసుపత్రిగా మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి

Published Fri, Apr 1 2016 3:04 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Appendix to the orders the Medical College

♦ మెడికల్ కాలేజీకి అనుబంధం చేస్తూ ఉత్తర్వులు
♦ అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
 
 సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా మార్చుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇప్పటివరకు వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు.

ఈ ఏడాది వైద్య విద్యా సంవత్సరం నుంచి మహబూబ్‌నగర్‌లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇందుకోసం ప్రభుత్వం రూ. 450 కోట్లు కేటాయించింది. ఈ నిధులను కాలేజీ నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసమే కాకుండా బోధనాసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం కూడా ఖర్చు చేస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ జిల్లా ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement