Telangana Medical health department
-
Telangana: ‘108’ నుంచి జీవీకే అవుట్!
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించే ‘108’సేవల్లో మార్పులు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా దానిని నిర్వహిస్తున్న జీవీకే సంస్థకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉంది. త్వరలో టెండర్లు నిర్వహించి కొత్త ఏజెన్సీకి అప్పగించాలని భావిస్తోంది. అలాగే అత్యంత ఆధునిక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో నామినేషన్ పద్ధతిలో ఒక ప్రముఖ సంస్థకు ఇవ్వాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల టెండర్లకు వెళ్లడమే సరైనదనే నిర్ణయానికి వైద్య ఆరోగ్యశాఖ వచ్చింది. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా పరిశీలిస్తున్న వైద్యశాఖ అధికారులు.. అందుకోసం మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఉమ్మడి ఏపీలో..వైఎస్ హయాంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ‘108’అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అత్యవసరంగా వైద్యం అవసరమైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ‘108’నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తక్షణమే ఉచితంగా అంబులెన్స్ సేవలు పొందేలా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్నుంచే ‘108’గా ఈ పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. అందుబాటులో 333 వాహనాలు.. ప్రస్తుతం రాష్ట్రంలో 358 వాహనాలు ఈ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 రోడ్లపై అందుబాటులో ఉండగా, మిగిలినవి రిజర్వులో ఉంచారు. అప్పట్లో కొన్ని వాహనాలు చెడిపోగా, వాటి స్థానంలో కొన్ని వాహనాలను ‘గిఫ్ట్ ఏ స్మైల్’కింద అనేకమంది రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉచితంగా అందించారు. ప్రస్తుతం లక్షమంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉందని అంటున్నారు.రోజుకు ఒక్కో వాహనం నాలుగు ట్రిప్పులు వెళ్లేలా ఈ పథకాన్నితీర్చిదిద్దారు. ఫోన్ చేసిన దాదాపు 20 నిమిషాల్లో బాధితుల వద్దకు చేరుకోవాలనేది నిబంధన. 2007 నుంచి జీవీకే ఆధ్వర్యంలోనే.. ఈ అంబులెన్స్ సర్వీసులను ప్రస్తుతం జీవీకే సంస్థ నిర్వహిస్తుంది. ప్రభుత్వం ఒక్కో వాహనానికి రూ.1.62 లక్షల చొప్పున ఏడాదికి రూ.86 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అందులోనే ప్రాథమిక వైద్యంలో సుశిక్షితులైన సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చు కలిపి ఉంటాయి. 2007 నుంచి ఆ సంస్థకే అప్పగిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇప్పటికీ ఆ సంస్థ కార్యకలాపాలు చేస్తోంది. వాస్తవానికి జీవీకే నిర్వహణ సమయం 2016 లోనే ముగిసిందని, కానీ అప్పటినుంచి అలా పొడిగిస్తూ వస్తున్నారని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. ఇక ఆటోమేటిక్‌గా పరుగులు.. ప్రస్తుతమున్న ‘108’అత్యవసర అంబులెన్సులను ఉపయోగించుకుంటూనే, నిర్వహణలో అనేక మార్పులు చేర్పులూ చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్యంత ఆధునిక కాల్ సెంటర్‌కు రూపకల్పన చేస్తారు. దానిద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమేటిక్‌గా నడిపిస్తారు. ఆటోమేటిక్ కాల్ డిస్ట్రిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ టెలిఫోన్ ఇంటర్ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్‌వర్క్‌లను రూపొందిస్తారు. తద్వారా అంబులెన్స్ ప్రమాదం జరిగిన స్థలాన్ని అత్యంత వేగంగా (ర్యాపిడ్) గుర్తించి, తక్కువ సమయంలో బాధితులను చేరుకుంటుంది. అలాగే బాధితుడిని తీసుకెళ్లే ఆసుపత్రికి ముందస్తు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. విపత్తు నిర్వహణ, పోలీస్, ఫైర్ సర్వీసులకు అనుసంధానం ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అప్లికేషన్‌ను రూపొందిస్తారు. ఈ అప్లికేషన్‌ను విపత్తు నిర్వహణకు అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సర్వీసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అత్యంత సమర్థులైన, శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తారు. ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఎన్జీవోలతోనూ అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ డబ్బు..పేరు ఏజెన్సీది! భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో ఫస్ట్ రెస్పాండర్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. అన్ని కార్పొరేట్ కంపెనీల్లోనూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. శాటిలైట్ ట్రామా సెంటర్లను రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేసేలా టెండర్లలో అనేక నిబంధనలు విధిస్తారు. ఆ ప్రకారం ముందుకు వచ్చే ఏజెన్సీ సంస్థనే ఎంపిక చేస్తారు. ముఖ్యంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత) (సీఎస్ఆర్) కింద సంస్థే కొంత భరించేలా నిబంధన విధించే అవకాశముంది. అవసరమైతే రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుసరించడంపై కూడా సర్కారు ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే సంస్థలు తమ పేరును ప్రచారం చేసుకుంటున్నాయన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఏజెన్సీ కనీసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయకుండా.. సామాజిక బాధ్యత కింద ముందుకు వచ్చే సంస్థలను రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒక ప్రముఖ కంపెనీ ఈ మేరకు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. మండలానికో ’108’వాహనం ప్రతి మండలానికి ఒక ‘108’వాహనాన్ని సమకూర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా దాని పరిధిలోని సమీప గ్రామాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలు కలుగుతుందని, ప్రాణాపాయం నుంచి అనేకమందిని రక్షించ వచ్చని భావిస్తోంది. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉండగా, మండలానికి ఒకటి ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 70 వేల జనాభాకు ఒకటి చొప్పున ఉండేలా చూడాలని అనుకుంటున్నారు. వేతనాల పెంపుపై అధ్యయనం సిబ్బంది వేతనాలను పెంచాలనే కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వేతనాలు పెంచారు. అక్కడ ఎంత పెంచారన్న దానిపై అధికారులు అధ్యయనం చేశారు. ఆ ప్రకారం పెంచడం, ఐదేళ్లకోసారి సవరించడం వంటి అంశాలపైనా ఆలోచన చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని వేతనాలను, ఇతర సేవలనూ అధ్యయనం చేస్తున్నారు. -
కొత్తగా 516 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 516 కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 801922 మంది ఈ వ్యాధి బారిన పడగా, 793027 మంది కోలుకున్నారు. మరో 4784 మంది చికిత్స పొందుతుండగా.. 4111 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 26,976 మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 631 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. -
80 మంది వైద్యులకు షోకాజ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: పనిచేయని వైద్యుల పనిపట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలను మరింత మెరుగుపర్చే చర్యలకు శ్రీకారం చుడుతోంది. విధి నిర్వహణలో అలసత్వం వహించే వైద్యులకు ‘షాక్ ట్రీట్మెంట్’ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో దీర్ఘకాలికంగా, అనధికారికంగా గైర్హాజరవుతు న్న 80 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది. ఈ మేరకు ఫైలుపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సంతకం కూడా చేశారు. నోటీసులకు సకాలంలో స్పందించనివారిని విధుల నుంచి తొలగించాల ని వైద్య, ఆరోగ్య శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన కార్డియాలజీ, ఆర్థో, గైనకాలజీ, రేడియాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలకు చెందిన ఈ స్పెషలిస్ట్ వైద్యు లు ప్రైవేట్ పాక్టీస్ పెట్టుకోవడం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచే యడం, భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వకపోవ డం, సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఉండటం తదితర కారణాలతో అనధికారికంగా గైర్హాజరవుతున్నట్లు గుర్తించిం ది. వేటు పడిన తర్వాత అలా ఖాళీ అయ్యే పోస్టులను తక్షణమే నింపాలని కూడా అధికారులు నిర్ణయించారు. డాక్టర్ల పనితీరుపై సమీక్ష ‘హైదరాబాద్‌లోని ఒక బోధనాసుపత్రిలో పనిచేసే ఓ స్పెషలిస్ట్ 20 ఏళ్లలో ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదు. కీలకమైన విభాగానికి చెందిన ఈయన ఇంకా ఏం పనిచేస్తున్నట్లు?’ఇది కీలకమైన ప్రజాప్రతినిధికి వచ్చిన ప్రశ్న. రాష్ట్రంలో ఏరియా, బోధన, ఇతర ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులున్నా, వారిలో కొందరు ఏమాత్రం పనిచేయడంలేదని వైద్యవర్గాలకు స్పష్టమైన సమాచారం ఉంది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోజుకు 20 వరకు కాన్పులు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకు 50 కూడా చేయని పరిస్థితి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాన్పులకు వచ్చేవారిని నిరుత్సాహపరచడం, డాక్టర్ అందుబాటులో లేకపోవడం వంటివి ఈ దుస్థితికి కారణాలుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా ఆసుపత్రుల వైద్యుల పనితీరుపై నివేదికలు దాదాపు పూర్తయ్యాయి. తక్కువ పనితీరున్న డాక్టర్లను బదిలీ చేసే అవకాశముంది. వారి అవసరం పెద్దగా లేనిచోటుకు తరలిస్తారు. వైద్య పోస్టుల హేతుబద్ధీకరణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కోచోట ఒక్కో విచి త్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని ఆసుపత్రుల్లోనైతే రోజూ వచ్చే రోగుల కంటే డాక్టర్లు ఎక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల రోగులు ఎక్కువ వస్తున్నా డాక్టర్లు సరిపడా లేరు. ఎన్నాళ్లుగానో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువమంది డాక్టర్లు ఉన్నచోట నుంచి కొరత ఉన్న ఆసుపత్రులకు డాక్టర్లను పంపాలని, ఆ విధంగా హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. అది త్వరలో కార్యరూపం దాల్చనుంది. రాజకీయ ఒత్తిళ్లను ఖాతరు చేయకుండా ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా డాక్టర్ల సంఘాలతో ముందస్తుగా చర్చించి వాటి సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. -
నేడు ఎంసెట్-2 నోటిఫికేషన్
జూలై 9న ప్రవేశ పరీక్ష - ఆ తర్వాత వారంలో ఫలితాలు.. ఆగస్టు 1 నుంచి తరగతులు - నీట్‌పై ఆర్డినెన్స్‌తో ప్రవేశాలపై తొలగిన సందిగ్ధం - ప్రభుత్వ, ప్రైవేటులో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఎంసెట్ ద్వారానే - ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లు నీట్ ద్వారా భర్తీ - ప్రైవేటు వైద్య సీట్లకు జూలై 24న నీట్-2 సాక్షి, హైదరాబాద్: నీట్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ల్లో ప్రవేశాలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం మెడికల్ ఎంసెట్-2కు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిసింది. ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 9న మెడికల్ ఎంసెట్-2 నిర్వహిస్తారు. అదే రోజు కీ విడుదల చేస్తారు. వారానికి ఫలితాలు విడుదల చేస్తారు. నీట్-2 ప్రవేశ పరీక్ష జూలై 24న నిర్వహించనున్నారు. ఇక నీట్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మొత్తం సీట్లతోపాటు ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్-2 ద్వారానే భర్తీ చేయనున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ(35 శాతం), 15 శాతం ఎన్నారై కోటా సీట్లను మాత్రం ‘నీట్’ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. 1,025 ప్రైవేటు సీట్లకు నీట్ తెలంగాణలో మొత్తం 18 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో 2,750 ఎంబీబీఎస్ సీట్లున్నా యి. అందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో(కొత్తగా వచ్చే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలుపుకొని) వెయ్యి సీట్లున్నా యి. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,450 సీట్లున్నాయి. ఇవిగాక రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను, 10 నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని 1,450 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం(725) సీట్లను ప్రభుత్వం నిర్వహించే మెడికల్ ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ లెక్కన 1,725 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35శాతం(507) బీ కేటగిరీ సీట్లను, మరో 15శాతం(218) సీట్లను ఎన్నారై కోటా సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. అలాగే మైనారిటీ కాలేజీల్లోని 300 సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. మొత్తం 1,025 సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక డెంటల్‌లో ప్రభుత్వ కాలేజీ ఒకటి ఉండగా అందులో 100 సీట్లున్నాయి. ప్రైవేటు డెంటల్ కాలేజీలు 11 ఉండగా... వాటిలో 1,040 సీట్లున్నాయి. వాటిలో ప్రభుత్వ, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ఆధారంగా.. మేనేజ్మెంట్ సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలపై పిడుగు కేంద్ర ఆర్డినెన్స్ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు పిడుగులాంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే బీ కేట గిరీ, ఎన్నారై మెడికల్ సీట్ల భర్తీ జరిగితే కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పడినట్లేనంటున్నారు. అయితే నీట్ ర్యాంకులను ప్రకటిం చాక.. అడ్మిషన్లు ఎవరు నిర్వహిస్తారన్న దానిపైనే ప్రైవేటు కాలేజీలకు ముకుతాడు పడుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుందంటున్నారు. ర్యాంకులు ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు. ఆర్డినెన్స్ శాస్త్రీయంగా ఉంది కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ శాస్త్రీయంగా ఉంది. ప్రభుత్వ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు మాత్రమే ఎంసెట్ నిర్వహించాలనడం సమంజసం. ఎందుకంటే ఆ సీట్లకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రమే పరీక్ష రాస్తారు. బయటి రాష్ట్రాల వారు రాయరు. ప్రైవేటులోని బీ కేటగిరీ సీట్లకు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. ఎన్నారై సీట్లను వారిష్టం వచ్చినట్లు భర్తీ చేసుకునేవారు. కాబట్టి నీట్ పరిధిలోనే వాటిని భర్తీ చేయాలనడం సమంజసంగా ఉంది. నీట్ వల్ల దేశంలో వివిధ రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పుతుంది. రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రైవేటు సీట్లలోనూ ప్రవేశాలకు అవకాశం దక్కుతుంది. - కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్ -
బోధనాసుపత్రిగా మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి
♦ మెడికల్ కాలేజీకి అనుబంధం చేస్తూ ఉత్తర్వులు ♦ అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా మార్చుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇప్పటివరకు వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ ఏడాది వైద్య విద్యా సంవత్సరం నుంచి మహబూబ్‌నగర్‌లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇందుకోసం ప్రభుత్వం రూ. 450 కోట్లు కేటాయించింది. ఈ నిధులను కాలేజీ నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసమే కాకుండా బోధనాసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం కూడా ఖర్చు చేస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ జిల్లా ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. -
మృతులను స్వగ్రామాలకు తరలిస్తాం
సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతి చెందిన వారిని స్వగ్రామాలకు తరలించడానికి ప్రభుత్వమే వాహనాలను సమకూర్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేదలు ఏదైనా కారణం వల్ల చనిపోతే మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం వారికి ఆర్థికంగా భారమవుతోంది. ఈ పరిస్థితిని నివారించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకోసం ముందుగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఈ ఉచిత సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రుల నుంచి కూడా గ్రామాలకు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అంబులెన్సులను అందుబాటులో ఉంచి చనిపోయిన వారిని ప్రభుత్వ ఖర్చుతోనే స్వగ్రామాలకు తరలిస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. తమిళనాడులో ఇటీవల పర్యటించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బృందం ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. -
ఇక ‘108’ ద్విచక్ర వాహనాలు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రద్దీతో కొట్టుమిట్టాడే హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో ‘108’ అత్యవసర అంబులెన్సులు సకాలంలో బాధితుల వద్దకు చేరుకోవడం లేదు. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా వెళ్లే అత్యవసర ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ వద్దకు వెళ్లింది. అనంతరం సీఎం సంతకం చేశాక ఇవి రోడ్లపైకి వస్తాయి. ముందుగా హైదరాబాద్ నగరంలో 50 వాహనాలను ప్రవేశపెట్టి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. 50 వాహనాలకు జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి రూ.70 లక్షలు కేటాయించారు. ప్రాథమిక చికిత్సే లక్ష్యం... తమిళనాడులో ప్రస్తుతం ఇలాంటి ‘108’ ద్విచక్ర వాహనాలు వైద్య సేవలు అందిస్తున్నా యి. ఆ రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వీటిని పరిశీలించారు. అంతకుముందే ఈ ఆలోచనలో ఉన్న ప్రభుత్వం... తమిళనాడులో పరిశీలించాక ఆగమేఘాల మీద అందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖకు పంపింది. ప్రమాదం లేదా ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స అందించేలా ద్విచక్ర వాహనంలో వైద్య పరికరాలు, మందులతో కిట్టు ఉంటుంది. ప్రాథమిక వైద్య చికిత్స తెలిసిన వ్యక్తే నడుపుతాడు. వాహనానికి నేవిగేటర్ సౌకర్యం కల్పిస్తారు. దాని ఆధారంగా బాధితుడు ఉన్న చోటుకు చేరేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుత ‘108’ అంబులెన్స్ సగటున 20 నిముషాల్లో చేరితే అదే ప్రాంతానికి ద్విచక్ర వాహనం 10 నిముషాల్లోపే వెళ్లేలా ఏర్పాట్లు ఉంటాయి. -
వైద్యారోగ్య శాఖలో కమీషన్ల దందా!
* పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు * ముడుపులిచ్చిన కంపెనీలకే కట్టబెట్టేందుకు యత్నం * వాటికి అనుకూలంగా నిబంధనల్లో మార్పులు.. * 10 నుంచి 15 శాతం కమీషన్లు అడిగారని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడి * బాగోతం వెనుక వైద్యారోగ్య శాఖను పర్యవేక్షించే ప్రముఖుడు * గాంధీ ఆస్పత్రిలో హృద్రోగ నిపుణుడి ఆధ్వర్యంలో వ్యవహారం * ఆ నిపుణుడిని మంత్రికి పరిచయం చేసింది తానేనన్న డీఎంఈ * ప్రస్తుతం ముఖ్య కార్యదర్శి చేతికి టెండర్ల వ్యవహారం * 24వ తేదీనే టెండర్ల గడువు ముగిసినా 5వ తేదీ వరకూ పొడిగింపు * వ్యవహారంపై స్పందించని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు రూ. 208 కోట్లతో వైద్య పరికరాల కొనుగోళ్లకు సంబంధించి భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎంఎస్ఐడీసీ) పర్యవేక్షించాల్సిన ఈ వ్యవహారం చివరకు గాంధీ ఆస్పత్రిలో రహస్యంగా జరిగిన తీరు అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది. సుమారు 22 విభాగాలకు సంబంధించిన పరికరాల కొనుగోలు వ్యవహారం కేవలం ఒక హృద్రోగ నిపుణుడు చెప్పినట్టు జరిగింది. వైద్య నిపుణుల కమిటీ లేదు.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు.. వైద్యారోగ్య శాఖను పర్యవేక్షించే ప్రముఖుడు కోరిన మొత్తాన్ని ముట్టజెప్పేందుకు ముందుకు వచ్చిన ఐదు కంపెనీలకు ఈ కాంట్రాక్టు అప్పగించడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశమనే ఆరోపణలు వస్తున్నాయి. ఐదు కంపెనీల చుట్టూనే నిబంధనలు.. మొత్తం రూ. 208 కోట్లకు గాను తొలిదశలో రూ. 60 కోట్లతో పరికరాల కొనుగోళ్లకు టెండర్లు పిలిచారు. తొలుత టెండర్లో ఉన్న నిబంధనలు... ప్రీ బిడ్ మీటింగ్, సాంకేతిక్ కమిటీ బిడ్‌కు వచ్చే సరికి మారిపోయాయి. యాభై కంపెనీలు ఈ టెండర్లలో పాల్గొంటే ఐదు కంపెనీల చుట్టే వ్యవహారం నడిచింది. వాస్క్యులర్ సర్జరీ, కిడ్నీ మార్పిడి పరికరాలు, ఎండోస్కొపీ, బ్రాంకోస్కొప్ సెట్ లు, హోలిమియం లేజర్ సర్జికల్, అడల్ట్ నెఫ్రొస్కొప్ సెట్లు, అడల్ట్ యురెట్రోనోస్కొప్, స్కైటోస్కొప్ సెట్లు, పీడియాట్రిక్ సైటోస్కో ప్ సెట్లు, హెపటిక్ సర్జరీ, యూరో సర్జరీ వర్క్స్టేషన్లు, ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు తదితర ముప్ఫైకి పైగా ఖరీదైన పరికరాల కొనుగోళ్లను ఈ కంపెనీలకే కట్టబెట్టే విధంగా నిబంధనల్లో మార్పులు చేశారు. కీలక సూత్రధారులు ముగ్గురు..! ఈ పరికరాల కొనుగోలు కుంభకోణంలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ముగ్గురు కీలక సూత్రధారులని వినవస్తోంది. వీరిలో వైద్యవిద్యా విభాగానికి చెందిన ఒక అధికారి, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో సీనియర్ అధికారి, గాంధీ ఆస్పత్రికి చెందిన హృద్రోగ నిపుణుడు ఉన్నారు. ఈ తతంగాన్ని తెరవెనుక నుంచి ఆ శాఖ ప్రముఖుడికి చెందిన వ్యక్తి నడిపారు. ఏపీఎంఎస్‌ఐడీసీలోని బయో మెడికల్ ఇంజనీర్లను గాంధీ ఆస్పత్రికి పిలిపించుకుని ఏ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వా లో నిర్ణయించారు. దీనికి అంగీకరించని ఓ బ యో మెడికల్ ఇంజనీర్ దీనిపై ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌కు లేఖ రాశారు. అభ్యంతరాలు పట్టించుకోలేదు.. పరికరాల టెండర్లపై వారం రోజుల కింద ప్రీబిడ్, టెక్నికల్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గాంధీ ఆస్పత్రి వైద్యుడు పర్యవేక్షణాధికారి. ఆయన తనకున్న పలుకుబడితో కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చారు. కొందరు అధికారులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. సాధారణంగా అయితే ప్రతి ఆస్పత్రి నుంచి ఆయా పరికరాలు అవసరమైన విభాగం హెడ్లు వచ్చి దీనిపై చర్చించాలి. కానీ గాంధీ ఆస్పత్రికి చెందిన ఆ హృద్రోగ నిపుణుడే... న్యూరో, జనరల్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ వంటి విభాగాలకు అవసరమైన పరికరాలనూ ఆమోదించేశారు. ఈ జాబితాపై వైద్యవిద్యా డెరైక్టర్ పుట్టా శ్రీనివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎగ్జిక్యూటివ్డెరైక్టర్ రాజేందర్ సంతకాలు చేశారు. ముఖ్య కార్యదర్శి వద్ద ఫైలు.. ఈ వైద్య పరికరాల కొనుగోలు వ్యవహారం ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా చేతిలో ఉంది. వాస్తవానికి టెండర్ తుది గడువు ఈ నెల 24తోనే ముగిసింది. కానీ శనివారం ముఖ్య కార్యదర్శి గడువును వచ్చే నెల 5వ తేదీ వరకూ పొడిగించారు. అయితే పరికరాల కొనుగోలుకు సంబంధించి అవకతవకలపై ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదులు వెళ్లాయి. చాలా మంది కంపెనీల ప్రతినిధులు ఈ బాగోతాన్ని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రికి పరిచయం చేసింది నేనే: వైద్యవిద్యా డెరైక్టర్ పుట్టా శ్రీనివాస్ పరికరాల కుంభకోణంలో కీలక పాత్రధారిగా చెప్పుకుంటున్న గాంధీ వైద్యుడిని ఓ సందర్భంలో మంత్రి రాజయ్యకు పరిచయం చేసింది తానేనని వైద్యవిద్యా డెరైక్టర్ డా.పుట్టా శ్రీనివాస్ తెలిపారు. మంత్రి అనుమతి ఇచ్చాకే ఆయనను పర్యవేక్షణాధికారిగా నియమించుకున్నామని చెప్పారు. అయితే ఆయన అక్రమాలకు పాల్పడింది తనకు తెలియదని పేర్కొన్నారు. తాను కంపెనీల జాబితా మీద సంతకం చేసింది వాస్తవమేనని... కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చిన విషయం తనకు తెలియదని వివరించారు. ఒక్క స్పెషాలిటీ వైద్యుడిని కూడా పిలవకుండా ఎలా సంతకాలు పెట్టారని ప్రశ్నించగా... త్వరలోనే హెచ్వోడీలను పిలిచి పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పటికే ముఖ్య కార్యదర్శికి టెండర్ల వ్యవహారంపై మెయిల్ ద్వారా వివరణ ఇచ్చినట్టు శ్రీనివాస్ తెలిపారు. కాగా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలపై ఏపీఎంఎస్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజేందర్ అందుబాటులోకి రాలేదు. పదే పదే ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. రహస్యంగా ఒప్పందం.. పరికరాల కొనుగోలుకు సంబంధించి ప్రీ బిడ్ భేటీకి ముందురోజే ఆయా కంపెనీల ప్రతినిధులతో అధికారులు రహస్యంగా సమావేశం నిర్వహించారని అందులో పాల్గొన్న ఓ కంపెనీ ప్రతినిధి సాక్షికి తెలిపారు. సమావేశంలో పాల్గొన్న గాంధీ వైద్యులు తమను 10 నుంచి 15 శాతం కమీషన్లు అడిగారని... కొందరం ఇవ్వలేమని చెప్పామని వెల్లడించారు. దీంతో తెల్లారేసరికి తమ కంపెనీలకు సంబంధించిన ‘స్పెసిఫికేషన్స్ (ప్రత్యేకతలు)’ నిబంధనల నుంచి మాయమయ్యాయని ఆయన చెప్పారు. కమీషన్లు ఇచ్చేందుకు ఒప్పుకొన్న కంపెనీలకు సంబంధించిన ప్రత్యేకతలన్నింటినీ ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఆ ఐదు కంపెనీలు, పరికరాలు... కంపెనీ ఏ పరికరాలకు కార్ట్స్ట్రొజ్ ల్యాప్రొస్కోపిక్ పరికరాలు బెట్షొల్డ్ ఆపరేషన్ థియేటర్ లైట్లు బి బ్రాన్ ఓటీ ల్యాప్రొస్కోపిక్ పరికరాలు స్ట్రైకర్ ఆపరేషన్ టేబుళ్లు సోరింగ్ లివర్ట్రాన్స్ప్లాంటేషన్పరికరాలు