నాగర్‌కర్నూల్‌రూరల్ : 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇన్‌స్పైర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ డీఈఓ రవీందర్ సూచించారు. శనివారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో సైన్స్ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకు రాష్ట్ర స్థాయినుంచి ‘ మనటీవీ ’ ద్వారా టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇన్‌స్పైర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి
Published Sun, Jul 24 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
నాగర్‌కర్నూల్‌రూరల్ : 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇన్‌స్పైర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ డీఈఓ రవీందర్ సూచించారు. శనివారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో సైన్స్ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకు రాష్ట్ర స్థాయినుంచి ‘ మనటీవీ ’ ద్వారా టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 3 వరకు ఇన్‌స్పైర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికయ్యేవారు భావితరాలకు మానవవనరులను ఉపయోగించుకునేలా సైన్స్ ప్రాజెక్టులను రూపొందించాలని, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయాలన్నారు.కార్యక్రమంలో మండల విద్యాధికారి జయశ్రీ , వివిధ పాఠశాలల 35మంది సైన్స్ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement