అశ్వర్థ నారాయణస్వామి తిరునాళ్లు
అనంతపురం కల్చరల్ : నగర శివార్లలోని అశ్వర్థ నారాయణస్వామి తిరునాళ్లు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు సాగే ఆ ఉత్సవాలలో భాగంగా తొలిరోజు ఉదయం స్వామివారికి శుద్ధి కార్యక్రమాలు, అలంకార సేవలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను భజన బృందాలతో కట్టవద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఆలయ ఈవో రామాంజనేయులు మాట్లాడుతూ ఆదివారం ఉదయం తిరునాళ్లను శాస్త్రోక్తంగా జరిపిస్తామన్నారు. అన్నదానం ఏర్పాట్లు చేశామన్నారు. రాత్రి సోములదొడ్డి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కళాకారులు నవరత్నాలు నాటికను ప్రదర్శిస్తారని తెలిపారు. అలాగే తడకలేరు రాఘవేంద్రస్వామి ఆలయంలో తిరునాళ్ల సందర్భంగా అఖండ రామభజన ప్రారంభమైంది.