పోరాడి సాధించింది..
పోరాడి సాధించింది..
Published Sun, Sep 18 2016 8:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
* ఎస్‌ఎస్‌సీ రీవాల్యుయేషన్‌లో సైతం పాత మార్కులే..
* త్రిసభ్య కమిటీ నివేదికలో 10/10 జీపీఏ సాధించిన వైనం
* విజయ దరహాసంతో అల్లం భావన
భట్టిప్రోలు(గుంటూరు) : పదవ తరగతి పరీక్షల్లో 9.8 జీపీఏ ర్యాంకు పొందిన ఓ విద్యార్థిని ఎస్‌ఎస్‌సీ బోర్డుకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా మళ్లీ అవే మార్కులు వచ్చాయని పంపారు. అయితే తనపై తనకు అంచచల విశ్వాసమున్న ఆ విద్యార్థిని అంతటితో తన రాత అంతేలే అని ఊరుకోలేదు. రీవాల్యుయేషన్‌లో కూడా తప్పు జరిగిందంటూ మళ్లీ ఎగ్జామినేషన్ బోర్డును ఆశ్రయించింది. ముచ్చటగా మూడోసారి ఆ బాలిక సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసి చివరకు బోర్డు 10కి10 జీపీఎ ర్యాంకు ఖరారు చేసి పంపింది. విజయగర్వంతో విద్యార్థిని వదనంపై చిరు దరహాసం మెరిసింది.
9 జీపీఏ రావడంతో నిరాశ..
భట్టిప్రోలుకు చెందిన అల్లం వెంకట్రావు కుమార్తె అల్లం భావన ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో గత విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసింది. మొదటి నుంచి భావన చదువులో మంచి మార్కులు సాధిస్తూ పాఠశాల స్థాయి నుంచి ప్రథమురాలుగా నిలిచేది. అయితే పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 జీపీఏ రావడంతో హతాశురాలైంది. బోర్డుకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేయగా పరీక్షల్లో 5 సబ్జెక్ట్‌ల్లో 10కి 10 జీపీఎ మార్కులు రాగా సోషల్ సబ్జెక్ట్‌లో 9 జీపీఎ మార్కులు వచ్చినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు సమాధాన పత్రాలు పంపినా ఫలితంల లేకపోయింది. చివరికి త్రిసభ్య కమిటీ పరిశీలించగా న్యాయంగా ఆమెకు ఒక మార్కు రావాలని నిర్ధారించింది. ఎట్టకేలకు పరిశీలించిన ఎస్‌ఎస్‌సీ బోర్డు దొర్లిన తప్పును సరిచేసి ఈ నెల 9వ తేదీన 1 మార్కు కలిపి ఏ2 గ్రేడ్ నుంచి ఏ1 గ్రేడ్‌కు మార్చి ఉత్తర్వులు పంపినట్టు భావన తండ్రి వెంకట్రావు తెలిపారు.
Advertisement
Advertisement