ఆక్వా పార్క్‌పై తాడోపేడో
ఆక్వా పార్క్‌పై తాడోపేడో
Published Fri, Jan 6 2017 12:09 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
నరసాపురం : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో సాగుతున్న ఉద్యమం జిల్లా చరిత్రలో కొత్త పేజీని ఆవిష్కరించింది. భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల పరిధిలోని 40 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. జిల్లా ఉద్యమాల చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా అన్ని గ్రామాల్లో గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పోలీస్ పికెట్లు, అప్రకటిత కర్ఫ్యూ, నిర్బంధాలు, రౌడీ మూకల దాడులను భరి స్తూనే.. భూములను, నీటి వనరులను రక్షించుకునేందుకు తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణ యించుకున్నారు. ఏడాదిన్నర క్రితం ప్రజలే స్వచ్ఛందంగా ప్రారంభించిన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలుస్తోంది. సీపీఎం, ఇతర రాజ కీయ పార్టీలు సైతం సంఘీభావంగా జత కలి శాయి. గురువారం 40 గ్రామాల్లో చేపట్టిన రిలే దీక్షలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మరీ ముఖ్యంగా మహిళలు అగ్రభాగాన నిలబడ్డారు. కంసాలి బేతపూడిలో 150 మంది మహిళలు దీక్షలో కూర్చున్నారు. ‘ప్రజల పొట్ట లు కొట్టే ఫ్యాక్టరీ మాకొద్దు, మా పిల్లల భవిష్యత్‌ను నాశనం చేసే అభివృద్ధి వద్దే వద్దు’ అంటూ నినదించారు. ‘మాపై ఎన్నో కేసులు పెట్టారు, అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచారు. చివరకు గూండాలచేత కొట్టించారు. ఇంతకంటే ఏం చేయగలరు. ఇంకెన్ని దౌర్జన్యాలు, దాడులు, దాషీ్టకాలు చేసినా భరిస్తాం. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుం టాం. ఫ్యాక్టరీ కట్టాలని ప్రభుత్వం తీర్మానించుకుంటే మా శవాలపై కట్టుకోవాల్సిందే’ అని తెగేసి చెప్పారు. ఆక్వా పార్క్ బాధిత గ్రామాల్లో ప్రజలకు భరోసా ఇవ్వడానికి, దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ ముఖ్యనేతలు గ్రామగ్రామానికి వెళ్లారు. దీక్షలు చేస్తున్న వారితో మాట్లాడి.. ఈ పోరాటంలో కడవరకూ ప్రజల పక్షాన నిలబడతామని భరోసా ఇచ్చారు. నరసాపురం పట్టణంలో ముదునూరి ప్రసాదరాజు నివాసం నుంచి ఉదయం 10 గంటలకు మొదలైన ర్యాలీ సరిపల్లి, మల్లవరం, మల్లవరం లంక, కంసాలిబేతపూడి, తుం దుర్రు, వెంప గ్రామాల మీదుగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సీపీఎం నాయకులు, కార్యకర్తలు సైతం ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు.
ప్రజలు ముఖ్యమా..
ఫ్యాక్టరీ ముఖ్యమా : ఆళ్ల నాని
ఓట్లేసి గెలిపించి.. అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలు ముఖ్యమో.. ఫ్యాక్టరీ ముఖ్యమో ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని సవాల్ చేశారు. మల్లవరంలంకలో దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడారు. నిర్బంధాలు, దౌర్జన్యాలను భరిస్తూ.. దాదాపు 40 గ్రామల ప్రజలు ఆక్వా పార్క్ వద్దని చెబుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందోలేదోననే అనుమానం కలుగుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ప్రజల అభీష్టాన్ని గౌరవించాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఫలితంగా ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుందన్నారు. ఇప్పుడు తుందుర్రు ఆక్వా పార్క్ విషయంలో టీడీపీ ప్రభుత్వం అలాగే ముం దుకు వెళుతోందని, ఆ పార్టీకి నూకలు చెల్లే కాలం వచ్చిందని అన్నారు. జిల్లా ఉద్యమ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 40 గ్రామాల ప్రజలు ఒకేరోజు నిరాహార దీక్షలకు పూనుకున్నారంటే.. పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిం చారు. ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని ప్రాం తానికి తరలించే వరకూ వైఎస్సార్ సీపీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని, ఆ విషయాన్ని మర్చిపోతే ప్రభుత్వాధినేతలకు పుట్టగతులుండవని అన్నారు. మత్స్యకారులు, రైతులు, ప్రజలకు కీడుచేసే ఫ్యాక్టరీని వేరే చోటకు తరలించాలని కోరారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు కొయ్యే మోషే న్ రాజు, పీడీ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకరం, మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినాథ్‌ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలపై నిర్బంధాలు, పోలీసుల వేధింపులను సహిం చేది లేదన్నారు. సీపీఎం నేతలు కవురు పెద్దిరాజు, జేఎ న్‌వీ గోపాలన్, ఐద్వా జిల్లా కార్యదర్శి విమల, ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఆరేటి సత్యవతి, ఆరేటి వాసు తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement