హైదరాబాద్: మలక్‌పేట్‌లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో స్కూలు విద్యార్థుల ఆటో నడుపుతున్న డ్రైవర్ పట్టుబడ్డాడు. శనివారం మధ్యాహ్నం మలక్‌పేట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా స్కూలు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ మొహమ్మద్ ఉస్మాన్‌ను పరీక్షించగా అతడు మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆ ఆటో డ్రైవర్ ప్రతిరోజూ కింగ్‌కోఠిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తుంటాడని విచారణలో తేలింది. ఆటోలలో విద్యార్థులను స్కూలుకు పంపే తల్లిదండ్రులు... ఆటో డ్రైవర్ల పరిస్థితిని ఒక్కసారి గమనించాలని, వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి కోరారు.
డ్రంక్ అండ్ డ్రైవ్: ఆటో డ్రైవర్ అరెస్ట్
Published Sat, Nov 5 2016 4:45 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Advertisement