- జాతీయ సమైక్యత శిబిరంలో ఏడు అవార్డులు
అనంతపురం మెడికల్ :
స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అవార్డుల పంట పండింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత నెల 28 నుంచి ఈ నెల 3 వరకు నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరంలో కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ వలంటీర్లకు ఏడు మెరిట్ అవార్డులు దక్కాయి. ఐదు రాష్ట్రాల నుంచి 13 యూనివర్సిటీలకు చెందిన 128 వలంటీర్లు పాల్గొనగా అత్యధిక అవార్డులు మన కళాశాల విద్యార్థులు దక్కించుకున్నారు. బృందగానం, బృంద నృత్యం, మోనో యాక్షన్, క్లాసికల్ డాన్స్, పోస్టర్ ప్రజెంటేషన్‌లో వీరు ప్రతిభ చూపారన్నారు. కూచిపూడి నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించినందుకు ప్రణతి, లక్ష్మీశ్రీలను ఇంటర్నేషనల్ యూత్ ఎకే కళాశాలకే చెందిన భార్గవ్ తేజనాయక్ సొంతం చేసుకున్నారు. సోమవారం కళాశాలకు చేరుకున్న విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు అభినందించారు.