- జిల్లా జడ్జి నాగమారుతీశర్మ
మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
Published Fri, Jul 29 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
ముకరంపుర : మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి నాగమారుతీశర్మ అన్నారు. శుక్రవారం స్వశక్తి కళాశాలలో జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ సభ్యుల నెలవారీ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సోషల్ యాక్షన్ కమిటీ ద్వారా కేసుల పరిష్కారం పారదర్శకంగా ఉండాలన్నారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు పరిష్కరించాలని సూచించారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా న్యాయం వైపే మొగ్గు చూపాలన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులకు శిక్షణ ఇప్పించి అర్హులను పారా లీగల్ సభ్యురాలిగా కార్డు ఇప్పిస్తామని తెలిపారు. అనంతరం జడ్జిని సన్మానించారు. డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ, లీగల్ సర్వీసెస్ అ«థారిటీ సెక్రటరీ భవానిచంద్ర, ఏపీడీ వై.రమేశ్, ప్రాజెక్టు మేనేజర్ పి.సునిత, సెర్ప్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మేనేజర్ జంగారెడ్డి, లీగల్ కన్సల్టెంట్ వేణుగోపాల్ తదితరులున్నారు.
Advertisement