ఉద్యోగుల బాహాబాహీ
Published Tue, Jul 19 2016 11:28 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
ఎస్కేయూ : వర్సిటీలోని యూజీ విభాగంలో సోమవారం ఇద్దరు ఉద్యోగులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. సర్టిఫికెట్ల మీద సంతకాలు చేయడానికి ముందుగా పరిశీలన కోసం రికార్డు తీసుకురమ్మని యూజీ సూపరింటెండెంట్ ఆర్.కేశవ రెడ్డి, అదే విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నాగేనాయక్‌ను ఆదేశించారు. సర్టిఫికెట్లు ఎక్కువ పెండింగ్‌లో ఉండటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువురు దాడికి పాల్పడ్డారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ వద్ద పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో నాగేనాయక్‌కు మద్దతుదారైన రామ్మోహన్ అనే ఉద్యోగి కేశవరెడ్డిని దుర్భాషలాడాడు. రిజిస్ట్రార్ సమక్షంలోనే మరోసారి వివాదం ముదిరింది. రామ్మోహన్ ఆవేశంతో రిజిస్ట్రార్ బల్ల మీద ఉన్న అద్దాన్ని పగులగొట్టాడు. దీంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదరలేదు. ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇరువురు ఫిర్యాదు చేశారు.
Advertisement