
బాల్‌బాడ్మింటన్ విజేత ‘అనంత’ యంగ్‌స్టార్
అమరాపురం : మండలంలోని గౌడనకుంట ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో అనంతపురం యంగ్‌స్టార్ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అనంతపురం–ఏ జట్టుపై అనంతపురం యంగ్‌స్టార్ జట్టు గెలిచింది. సుమారు 15 జట్లు వివిధ గ్రామాల నుంచి పోటీల్లో పాల్గొన్నాయి.
మొదటి విజేత అనంతపురం యంగ్‌స్టార్ జట్టుకు గౌడనకుంట గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు దొడ్డీరప్ప కుమారుడు వీరేష్ రూ.15 వేలు, ద్వితీయ బహుమతి అనంతపురం–ఏ జట్టుకు హెచ్.రామకృష్ణ తండ్రి హనుమంతరాయప్ప రూ.10 వేలు, తృతీయ బహుమతిని తమ్మడేపల్లి సర్పంచ్ కరియమ్మ రూ.5 వేలను గౌడనకుంట ఫ్రెండ్స్ జట్టుకు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ కవితా ఉగ్రనరసింహ, ఆస్పత్రి కమిటీ చైర్మన్ కృష్ణమూర్తి, న్యాయనిర్ణేతలు నవీన్‌కుమార్, హనుమంతరాయప్ప, ఎంపీటీసీ సభ్యులు హేమలత, శారదమ్మ, నిర్వాహకులు హనుమంతరాయుడు, రాఘవేంద్ర, సిద్ధేశ్వర, శ్రీనివాసమూర్తి, రజినీకుమార్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.