ఈ నెల 28న బ్యాంకుల సమ్మె | bankers strick on 28th | Sakshi
Sakshi News home page

ఈ నెల 28న బ్యాంకుల సమ్మె

Published Wed, Feb 22 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

bankers strick on 28th

కర్నూలు(అగ్రికల్చర్‌): యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు 28న చేపట్టే సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఏఐబీఈఓ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచి ఎదుట భోజన విరామ సమయంలో వివిధ డిమాండ్‌లపై నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తివేయాలని, గ్రామీణ ప్రాంతాలకు చెందిన  బ్యాంకులను అవసరమైనంత నగదు ఇవ్వాలని, నోట్ల రద్దు సమయంలో కొందరు పెద్దలకు ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి కొత్త కరెన్సీ వెళ్లిదని దీనిపై సీబీఐ విచారణ జరపాలని తదితర డిమాండ్‌లతో 28న బ్యాంకుల సమ్మె పాటిస్తున్నట్లు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement