పుట్టపర్తి టౌన్ : గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికలలో హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ విమర్శించారు. ఆదివారం స్థానిక కోటా గార్డెన్స్‌లో ఎంఈఓ గోపాల్‌నాయక్ అధ్యక్షతన రాష్ట్ర గిరిజన ప్రతినిధుల సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐక్య ఉద్యమం ద్వారా గిరిజనులు హక్కులు సాధించుకునేందుకు ఉద్యమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం గిరిజనులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యధోరణికి అద్దం పడుతోందన్నారు. గిరిజనులను ఓటుబ్యాంకుగా వాడుకునే వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్‌నాయక్ మాట్లాడుతూ ప్రజా సాధికార సర్వే పేరుతో సంక్షేమ పథకాలు రద్దుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,అదే జరిగినే ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీలకతీతంగా గిరిజనులు హక్కుల సాధనకు పోరాడాలన్నారు. అంతకుముందు గిరిజన ఉద్యోగ,కార్మిక సంఘాలు పట్టణంలో బైక్, ఆటోల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవినాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీరాములునాయక్, జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్, ఉపాధ్యక్షుడు దేవేంద్రనాయక్, కార్యదర్శి విజయకుమార్‌నాయక్, ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ నాగరాజునాయక్, శ్రీనివాసనాయక్, సీఐ జగదీష్‌నాయక్, రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షుడు కాలేనాయక్, కౌన్సిలర్లు శ్రీరాంనాయక్,రాంజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో సీఎం విఫలం
Published Sun, Oct 2 2016 11:37 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
Advertisement