bellaiah naik
-
కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల్లో ఆదివాసీ గిరిజనుల ఓట్లే కీలకమని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లోనూ తెలంగాణ గిరిజన ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ప్రాధాన్యతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులను మోసం చేస్తున్నాడని, మాయమాటలు చెప్పి వారి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరీలో బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ భరత్ చౌహాన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో పాటు కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, అన్ని జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వైపే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మొగ్గు..!
-
నువ్వా నేనే అన్నట్టుగా సాగిన కాంగ్రెస్-బీజేపీ ప్రచారం
-
గిరిజన రిజర్వేషన్లపై మొదటి సంతకమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న 9.9 శాతం ఓట్ల మేరకు గిరిజనులకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని, తాను అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లపై మొదటి సంతకం పెడతానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ఏఐసీసీ ఆది వాసీ వైస్‌చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గిరిజనుల పట్ల రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీసం రాష్ట్రంలో 1/70 చట్టం కూడా అమలు కావడం లేదని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలే కరులతో మాట్లాడుతూ జీవో 317 పేరుతో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోకి గిరిజనేతర ఉద్యోగులను తెస్తున్నారని, గిరిజన ద్రోహి తరహాలో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చి లక్షలాది మంది గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తే తెలంగాణ ఏర్పాటైన తర్వా త ఒక్క ఎకరం కూడా గిరిజనులకు భూపం పిణీ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనులు కాంగ్రెస్‌ను నమ్మడం లేదని మంత్రి సత్యవతి రాథోడ్ అనడం సరైంది కాదన్నారు. -
సమస్యల పరిష్కారంలో సీఎం విఫలం
పుట్టపర్తి టౌన్ : గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికలలో హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ విమర్శించారు. ఆదివారం స్థానిక కోటా గార్డెన్స్‌లో ఎంఈఓ గోపాల్‌నాయక్ అధ్యక్షతన రాష్ట్ర గిరిజన ప్రతినిధుల సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐక్య ఉద్యమం ద్వారా గిరిజనులు హక్కులు సాధించుకునేందుకు ఉద్యమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం గిరిజనులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యధోరణికి అద్దం పడుతోందన్నారు. గిరిజనులను ఓటుబ్యాంకుగా వాడుకునే వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్‌నాయక్ మాట్లాడుతూ ప్రజా సాధికార సర్వే పేరుతో సంక్షేమ పథకాలు రద్దుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,అదే జరిగినే ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీలకతీతంగా గిరిజనులు హక్కుల సాధనకు పోరాడాలన్నారు. అంతకుముందు గిరిజన ఉద్యోగ,కార్మిక సంఘాలు పట్టణంలో బైక్, ఆటోల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవినాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీరాములునాయక్, జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్, ఉపాధ్యక్షుడు దేవేంద్రనాయక్, కార్యదర్శి విజయకుమార్‌నాయక్, ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ నాగరాజునాయక్, శ్రీనివాసనాయక్, సీఐ జగదీష్‌నాయక్, రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షుడు కాలేనాయక్, కౌన్సిలర్లు శ్రీరాంనాయక్,రాంజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.