బెల్లయ్య నాయక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న 9.9 శాతం ఓట్ల మేరకు గిరిజనులకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని, తాను అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లపై మొదటి సంతకం పెడతానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ఏఐసీసీ ఆది వాసీ వైస్‌చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గిరిజనుల పట్ల రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీసం రాష్ట్రంలో 1/70 చట్టం కూడా అమలు కావడం లేదని ఆరోపించారు.
శనివారం గాంధీభవన్‌లో ఆయన విలే కరులతో మాట్లాడుతూ జీవో 317 పేరుతో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోకి గిరిజనేతర ఉద్యోగులను తెస్తున్నారని, గిరిజన ద్రోహి తరహాలో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చి లక్షలాది మంది గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తే తెలంగాణ ఏర్పాటైన తర్వా త ఒక్క ఎకరం కూడా గిరిజనులకు భూపం పిణీ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనులు కాంగ్రెస్‌ను నమ్మడం లేదని మంత్రి సత్యవతి రాథోడ్ అనడం సరైంది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment