
పసుపులో అంతర పంటగా గోరుచిక్కుడు
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
జహీరాబాద్ ప్రాంతంలో అనువైన నేలలు
ఏడీఏ వినోద్‌కుమార్
జహీరాబాద్ టౌన్: తక్కవ పెట్టుబడితో ఆదాయనిచ్చే పంటల్లో గోరుచిక్కుడు ఒకటి. జహీరాబాద్ ప్రాంతం నేలలు అనుకూలం కావడంతో ఇక్కడి రైతులు ప్రతి సంవత్సరం గోరు చిక్కడు పండిస్తారు. ఖరీప్ సీజన్ చివరి వరకు పంట సాగుచేసుకోవచ్చు. ఖరీఫ్, వేసవి పంటలకు గోరుచిక్కుడు అనుకూలం. మురుగునీరు పోయే సౌకర్యం కలిగిన సారవంతమైన నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. గొరు చిక్కుడు సాగు యాజమాన్య పద్ధతులను జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్ (7288894426)వివరించారు.
పూసా నవబహర్, పూసా మౌసమి అనువైన రకాలు.
- పూసా నవబహార్ రకం ఖరీఫ్, వేసవి పంటలకు అనువైనవి.
- కొమ్మలు లేకుండా ఉంటాయి. విత్తనాలు ,కాయలు పూసా మౌసమిలా ఉంటాయి.
- ఈ రకం విత్తనాలు ఖరీఫ్ సీజన్ ఆఖరి వరకు సాగు చేసుకోవచ్చు.
- ఎకరాకు 12-18 కిలోల వరకు విత్తనం అవసరం.
- విత్తేముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి.
- పొలంలో మొదిటిసారి విత్తుతే రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించాలి
- విత్తనాకి విత్తనానికి 60/15 దూరం చూసుకోవాలి.
- ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి.
- 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను సగం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
- మిగిలిన సగం ఎరువులను 30-40 రోజులకు వేయాలి.
- పైసా మౌసమి రకం ఖరీఫకు అనుకూలం. గింజ విత్తిన 70-80 రోజులకు మొదటి కోత వస్తుంది.
- పంటలో కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.
- పొలంలో గింజలు విత్తగానే మూడు రోజులకు నీర పారించాలి.
- తర్వాత వారం రోజులకు ఓ సారి నీటి తడులు ఇవ్వాలి
- లేత కాయలు కోసి మార్కెట్‌కు పంపాలి.
- కాయ ముదురు కాకుండా చూడాలి. ముదరవుతే పీచు శాతం అధికమై నాణ్యత తగ్గుతుంది.
- సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
- గోరు చిక్కుడు అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు
- పసుపు, మిరప, బెండ తదితర పంటల్లో వేయవచ్చు