ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు | Benefits ofdeleavery in govt hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు

Published Sat, Jun 10 2017 4:45 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు

డీఎంహెచ్‌వో జలపతినాయక్‌
కడెం(ఖానాపూర్‌): ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలని డీఎంహెచ్‌వో జలపతినాయక్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు వైద్య పరీక్షలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకుంటే ప్రభుత్వం అందించే రూ. 12 వేలు, పుట్టిన బిడ్డకు కేసీఆర్‌ కిట్లతో పాటు మరెన్నో ప్ర యోజనాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మానస, సీడీపీవో విజయలక్ష్మి, అంగన్‌వాడీలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. దస్తురాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గంగామణి వైద్యాధికారి హారిక, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ చిత్రకళ, అంగన్‌వాడీలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement