deleavery
-
ఫుడ్ డెలివరీకి కొత్త రూల్..
ఆహారోత్పత్తులు విక్రయించే ఈ–కామర్స్ కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త నిబంధన విధించింది. ఏదైనా ఆహారోత్పత్తి గడువు ముగిసే తేదీకి కనీసం 30 శాతం లేదా 45 రోజులు ముందుగా కస్టమర్‌కు చేరాలని స్పష్టం చేసింది. అంటే షెల్ఫ్ లైఫ్ కనీసం 45 రోజులు ఉన్న ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.కాలం చెల్లిన, గడువు తేదీ సమీపిస్తున్న ఉత్పత్తుల డెలివరీలను కట్టడి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ & సర్టిఫికేషన్‌కి మద్దతుగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సూచించినట్లు తెలుస్తోంది. కల్తీని నివారించడానికి ఆహారం, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చేయాలని స్పష్టం చేసింది.గడువు ముగిసే ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డెలివరీ అయ్యే వస్తువులపై గడువు తేదీలు ఉండటం లేదంటూ అనేక ఫిర్యాదు వచ్చాయి. డెలివరీ చేస్తున్న వస్తువులపై ఎంఆర్పీ, "బెస్ట్ బిఫోర్" తేదీలు లేకపోవడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గత నెలలో క్విక్-కామర్స్, ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు
► డీఎంహెచ్‌వో జలపతినాయక్ కడెం(ఖానాపూర్): ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలని డీఎంహెచ్‌వో జలపతినాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు వైద్య పరీక్షలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకుంటే ప్రభుత్వం అందించే రూ. 12 వేలు, పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్లతో పాటు మరెన్నో ప్ర యోజనాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మానస, సీడీపీవో విజయలక్ష్మి, అంగన్వాడీలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. దస్తురాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగామణి వైద్యాధికారి హారిక, ఐసీడీఎస్ సూపర్వైజర్ చిత్రకళ, అంగన్వాడీలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.