బేటీ బచావో
జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా అమలాపురం విట్స్ విద్యాసంస్థల విద్యార్థులు ‘బేటీ బచావో’ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బాలిక బొమ్మను వినూత్నంగా గీసి, ‘బేటీ బచావో’ అంటూ హిందీలో రాసి, దానికి నలువైపులా వందలాదిగా విద్యార్థులు నిలబడి నినాదాలు చేశారు. చైర్మ¯ŒS ఏబీ నాయుడు మాట్లాడుతూ, అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నా.. బలమైన చట్టాలు తీసుకువస్తున్నా.. ఆడపిల్ల పుడుతోందని తెలుసుకొని, భ్రూణహత్యలకు పాల్పడడం అన్యాయమని అన్నారు. డైరెక్టర్ శ్యామలా మహాలక్ష్మి, డైరెక్టర్ వై.నాని, ప్రిన్సిపాల్ బి.సుధీర్‌బాబు, నాగమాధవి పాల్గొన్నారు.
– అమలాపురం