కాంగ్రెస్‌కు, చంద్రబాబుకి తేడా ఏముంది? | Bheesetti babji fire on TDP govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు, చంద్రబాబుకి తేడా ఏముంది?

Published Sun, Jun 5 2016 12:06 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

Bheesetti babji fire on TDP govt

లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  భీశెట్టి బాబ్జీ
 విజయనగరం క్రైం: రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న నవ నిర్మాణ దీక్షకి పెద్ద తేడా లేదని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ విమర్శించారు. తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిన రోజు  బ్లాక్‌డేగా పరిగణించవలసిన  చంద్రబాబు దీక్షల పేరుతో ప్రజలను గందరగోళంలోకి నెట్టి వేయడం విచిత్రంగా ఉందన్నారు.   
 
 శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ   ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తుంటే చంద్రబాబు రాష్ట్ర విభజనను మనస్ఫూర్తిగా ఆమోదించినట్లుగా కనిపిస్తోందన్నారు.  ప్రజలకు సేవలందించిన వలసిన ఆధికారులను, ఉపాధిహామీలో  పనిచేయడానికి వచ్చే కూలీలను నవనిర్మాణదీక్షల పేరుతో రోడ్లపై తిప్పడం మంచిదికాదని హితవు పలికారు.  సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఆర్.సుధాకర్,   నాయకులు   ఎం.చిన్నారావు, నారాయణం భానుమూర్తి, బంటు అర్జున్, తాట్రాజు రామారావు, నాగభూషనం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement