బైక్ కొట్టేసి దర్జాగా పారిపోతున్న ఓ దొంగను స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు.
మెట్‌పల్లి : బైక్ కొట్టేసి దర్జాగా పారిపోతున్న ఓ దొంగను స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని పాతబస్టాండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల లాడ్జి ముందు పార్క్ చేసిన బైక్‌ను ఓ ఆగంతకుడు అన్‌లాక్ చేసి తీసుకెళుతుండగా... దాన్ని లాడ్జి సిబ్బంది సీసీ కెమెరాల్లో గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానికులతో కలసి వెంబడించి దొంగను పట్టుకున్నారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.