గూట్లో నుంచి అరుస్తున్న పిట్ట పిల్లలు, పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నదృశ్యం
జగద్గిరిగుట్ట: జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిసరాలు పచ్చదనంతో అలరారుతున్నాయి. జీవ వైవిధ్య సదస్సును ఆదర్శంగా తీసుకుని నాటిన 193 మొక్కలు వృక్షాలుగా ఎదిగి... పక్షులకు ఆవాసాలుగా మారాయి. అవి గూళ్లు కట్టుకుని పిల్లలు పెడుతూ సంతానాన్ని వృద్ది చేసుకుంటున్నాయి. అక్కడ తమ పిల్లలకు పక్షులు ఆహారాన్ని తినిపిస్తున్న దృశ్యాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.