
బీజేపీ కార్యకర్తలు వాచ్‌డాగ్‌లు కావాలి : కె. లక్ష్మణ్
నల్లగొండ: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు పేదలకు చేరుతున్నాయా లేవా అనే విషయంలో బీజేపీ కార్యకర్తలు వాచ్‌డాగ్‌లా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం నల్లగొండలోని పోలీస్ ఆడిటోరియంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి లక్ష్మణ్ ప్రసంగించారు. నరేంద్రమోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్న సందర్భంగా ఇక్కడి ప్రజలకు కానుకలు, బహుమానాలు తీసుకువస్తున్నారని తెలిపారు.