
దేహదారుఢ్య పరీక్షలను పరిశీలిస్తున్న సీఐ నరసింహులు
జిల్లా ఎస్సీ ఘటమనేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు సీపీవోలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఐ నరసింహులు తెలిపారు.
సీపీవోలకు దేహదారుఢ్య పరీక్షలు
సత్యవేడు : జిల్లా ఎస్సీ ఘటమనేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు సీపీవోలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఐ నరసింహులు తెలిపారు. జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల నియామకం ఉన్నందున సీపీవోలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. సోమవారం సత్యవేడు, నాగలాపురం వరదయ్యపాళెం మండలాల పరిధిలో సీపీవోలుగా పనిచేస్తున్న యువతీ యువకులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మూడు మండలాల పరి«ధిలో కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్(సీపీవో)గా ఉన్న 200 మందిలో 74 మందిని దేహదారుఢ్య పరీక్షకు ఎంపిక చేశామన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, 72 మంది పురుషులు ఉన్నారన్నారు. రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం పర్యవేక్షించారు. ఎస్‌ఐలు మల్లేష్‌యాదవ్(సత్యవేడు);షేక్‌షావళి(వరదయ్యపాళెం), మునస్వామి(సత్యవేడు) పాల్గొన్నారు.