సిద్దిపేట రూరల్: ఓ విష సంస్కృతి పట్టణ, గ్రామీణ ప్రాంత యువతను పెడదోవపట్టిస్తోంది. దానిపేరే క్రికెట్ బెట్టింగ్. పదేళ్ల కిందట వన్డే మ్యాచ్‌లకే ఉండే ఈ వ్యస నం ఇప్పుడు ముదురుపాకాన పడింది. వన్డే, టెస్ట్, ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఇలా ఏదైనా సరే బెట్టింగ్‌లు పెడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు జిల్లాలోని యువకులను ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఆట గురించి కనీస పరిజ్ఞానం లేని యువకులు ఈ వ్యసనానికి బానిసై కుదేలవుతున్నారు.
హైదారాబాద్, ముంబై, కోల్‌కత్తా, ఢిల్లీ వంటి నగరాల్లో ఉండే ఆన్‌లైన్, సెల్‌ఫోన్‌ల ద్వారా అన్ని రాష్ట్రా ల్లో ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తు తం ఈ వ్యసనం గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకడంతో దీనికి బానిసలైన యువత భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. బెట్టింగ్‌లు కాసేవారిలో బడా వ్యాపారుల కుమారులే కాకుండా కంపెనీలు, షాపుల్లో పని చేస్తున్న యువకులు, విద్యార్థులు సైతం పాల్గొంటూ నష్టాల బాట పడుతున్నారు. మెదక్ జిల్లాలో ప్రధానంగా సిద్దిపేట, మెదక్, పటాన్‌చెరు, సంగారెడ్డి లాంటి పట్టణాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతుంది.
ఈ వ్యసనం బారినపడి ఎంతో మంది యువకులు తీవ్రంగా నష్టపోయారు. సిద్దిపేటకు చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌లకు అలవాటు పడి లక్షలు పొగొట్టుకున్నాడు. ఇతను ‘సాక్షి’తో మాట్లాడుతూ గత రెండు, మూడు సంవత్సరాలుగా బెట్టింగ్‌కు అలవాటు పడి లక్షలు పొగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. హైదారాబాద్‌లోని రామంతాపూర్‌లో ఓ బుకీ బెట్టింగ్‌ను న డిపిస్తున్నాడని, అతని దగ్గర తాను ల క్షలు పొగొట్టుకున్నానని తెలిపాడు. కా గా బెట్టింగ్ కాసిన డబ్బులు రూ.2 లక్ష లు అతనికి యువకుడు ఇవ్వాలి. అయి తే చెల్లించే స్థోమత లేకపోవడంతో బుకీ బెదిరింపులకు గురిచేస్తున్నట్లు బాధితు డు వాపోయాడు.
అలాగే సిద్దిపేట పట్టణానికి చెందిన మరో విద్యార్థి తాను ఇంట్లో తెలియకుండా రూ.లక్ష, 10 శాతం వడ్డీకి తీసుకోచ్చి బెట్టింగ్‌లు పెట్టి చేతులు కాల్చుకున్నాడు. కాగా వడ్డీకి తీసుకోచ్చిన డబ్బులు కట్టాలని ఇంటిపై దాడి చేయగా విద్యార్థి తండ్రి మిత్తితో సహా 1.50లక్షలు కట్టినట్లు తెలిసింది. అంటే పరిస్ధితి సిద్దిపేట పట్టణంలో కూ డా ఏ దశలో ఉందో అర్థం చేసుకోచ్చు. అయితే ఇంత జరుగుతున్నా నిఘా వ్యవస్థ నిద్ర పోతోంది. పట్టణంలో ఏం జరుగుతుందో కనిపెట్టలేకపోతోంది. ఇ ప్పటికైనా మేల్కొనకపోతే ఈ విష సం స్కృతి విషమించే ప్రమాదం ఉంది. యువత పెడదొవ పట్టకుండా తల్లిదం డ్రులు సైతం జాగ్రత్త పడాల్సిందే.
పల్లెలకు పాకిన విషసంస్కృతి
Published Sun, Sep 21 2014 11:53 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM
Advertisement
Advertisement