మిషన్ స్మార్ట్ రైడ్ పోస్టర్లను చూపుతున్న ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్
బారుల్లో బ్రీత్ ఎనలైజర్లు ఉండాలి
Published Sun, Aug 21 2016 8:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
బంజారాహిల్స్: హైదరాబాద్‌ను జీరో డీయూఐ (డ్రైవింగ్ అండర్ ఇన్‌టాక్సికేషన్)గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎకై్సజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని క్లబ్ ట్రినిటీలో మిషన్ స్మార్ట్‌రైడ్ అవగాహన పోస్టర్లను, బ్రీత్‌ఎనలైజర్లను ఆయన సైబరాబాద్ ఈస్ట్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ దివ్యచరణ్, మిషన్ స్మార్ట్‌రైడ్ ప్రతినిధి దిలీప్‌జైన్, క్లబ్ ట్రినిటీ నిర్వాహకులు విజయ్‌లతో కలిసి శనివారం రాత్రి ప్రారంభించారు.
బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన రమ్య మృతి అనంతరం ఎక్సైజ్, పోలీసు శాఖలు అనేక మార్పులు తీసుకొచ్చాయన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఉన్న మద్యం అందించే పబ్బులో అవగాహన కల్పించేందుకు ఈ పోస్టర్లను ఏర్పాటుచేయడంతోపాటు అక్కడ మద్యం సేవించే వారు సురక్షితంగా ఇంటికి వెళ్లడానికి, పరిమితికి మించి మద్యం సేవించకుండా ఉండేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం పబ్‌లోని సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా అన్ని పబ్బుల్లో ఈ విధానాన్ని విస్తరిస్తున్నట్లు వివరించారు.
అయితే మద్యం మోతాదు తనిఖీ చేసేందుకు ఉపయోగించే బ్రీత్ ఎనలైజర్ మిషన్‌లను పబ్బు నిర్వాహకులే సమకూర్చుకోవాలన్నారు. దిలీప్‌జైన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోనే ప్రభుత్వంతో కలిసి తొలిసారిగా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం క్లబ్ ట్రినిటీ తొలిగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇక అతిగా మద్యం సేవించిన వారి కోసం ఇప్పటికే ప్రైవేటు క్యాబ్‌లతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. తద్వారా వారిని సురక్షితంగా ఇంటికి చేరుస్తామన్నారు. ఇందులో భాగంగా కొన్ని ఉచిత రైడ్‌లను కూడా అందిస్తున్నామన్నారు.
Advertisement
Advertisement