
సందడిగా కృష్ణాష్టమి వేడుకలు
కుల్కచర్ల: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు సందడిగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు రాంరెడ్డిపల్లి, ముజాహిద్‌పూర్, తిర్మాలాపూర్, ఇప్పాయిపల్లి, రాంపూర్, పుట్టపహడ్, అంతారం, బండవెల్కిచర్ల, మందిపల్, చౌడపూర్, చెల్లాపూర్, ఘణపూర్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పలు పాఠశాలల్లో విద్యార్థుళు గోపిక, కృష్ణుల వేషధారణలతో అలరించారు. చిన్నారులతో ఉట్టిలు కొట్టడంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాంరెడ్డిపల్లి గ్రామంలో యాదవ సంఘం ప్రతినిధులు శ్రీకృష్ణుడికి పల్లకిసేవ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు నర్సిములు యాదవ్, యాదయ్య, మొగులయ్య, నర్సింహా, గోపాల్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.