
‘శంకుస్థాపన’కు సాయికుమార్ యాంకరింగ్
రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సభా నిర్వహణను(యాంకరింగ్) సినీ నటుడు సాయికుమార్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సభా నిర్వహణను(యాంకరింగ్) సినీ నటుడు సాయికుమార్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన సమీక్షలో దీనిపై చర్చించారు.
సభ ప్రారంభానికి ముందు ప్రఖ్యాత కళాకారుడు శివమణి వాద్య ప్రదర్శన, కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో మన అమరావతి, రైతుకు వందనం జానపద, కూచిపూడి నృత్యరూపకాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.