పది క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత | Capture ten quintals nallabellam | Sakshi
Sakshi News home page

పది క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

Published Mon, Aug 8 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

పది క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

పది క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

  • 1.50 క్వింటాళ్ల పటిక స్వాధీనం
  • ఐదుగురిపై కేసు నమోదు 
  • మహబూబాబాద్‌ రూరల్‌ : 
     
    అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను మహబూబాబాద్‌ రూరల్‌ పోలీసులు పట్టుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు. టాటాఏస్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూరల్‌ సీఐ జె.కృష్ణారెడ్డి, ఎస్సై సీహెచ్‌.శ్రీనివాస్‌ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అమనగల్‌ శివారు గుండాలగడ్డ తండాకు చెందిన హుస్సేన్‌ టాటాఏస్‌లో మరిపెడ నుంచి పది క్వింటాళ్ల నల్లబెల్లం, 1.50 క్వింటాళ్ల పటిక తీసుకుని ఆదివారం రాత్రి గుండాలగడ్డ తండాకు వచ్చాడు. ఈ బెల్లాన్ని తీసుకెళ్లేందుకు నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం శివారు సుందరం తండాకు చెందిన గుగులోత్‌ లక్‌పతి, బానోత్‌ రవి, గుగులోత్‌ రాము, నేతావత్‌ రవి మరికొందరు గుండాలగడ్డ తండాకు వచ్చారు. ఇది లె లుసుకున్న పోలీసులు ఎక్సైజ్‌ వారికి సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్‌ ఎస్సై రాయబారపు రవికుమార్, రూరల్‌ పీఎస్‌ హె డ్‌ కానిస్టేబుల్‌ డి.మనోహరస్వామి, సిబ్బంది తండాకు వెళ్లగా నింది తులు పరారయ్యారు. పోలీసులు టాటాఏస్,æ బెల్లం, పటికను స్వాధీనం చేసుకుని రూరల్‌ పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు. పరారైన ఆటోడ్రైవర్‌ హుస్సేన్, లక్‌పతి, రాము, బానోత్‌ రవి, నేతావత్‌ రవిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
     
    కేసముద్రంలో 12 క్వింటాళ్ల బెల్లం..
    కేసముద్రం : అక్రమంగా విక్రయిస్తున్న 12 క్వింటాళ్ల బెల్లం పట్టుకున్న సంఘటన మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఎక్సైజ్‌ ఎస్సై రేష్మా కథనం ప్రకా రం.. మండల కేంద్రానికి చెందిన పాలరమేష్‌ అనే వ్యాపారి అక్రమంగా బెల్లాన్ని ఓ గదిలో డంప్‌చేసి విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారి ఇంటì  సమీపంలోని ఓ గదిలో 24 బస్తాల బెల్లం, మరికొంత దూరంలో 170 కేజీల పటిక లభ్యమయ్యాయి. బెల్లం,పటిక స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ అధికారులు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. దాడులు నిర్వహించిన వారిలో ఎక్సైజ్‌  సిబ్బంది యాదగిరి, గౌస్, అయూబ్, రామ్మూర్తి తదితరులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement