రోడ్డు రవాణా శాఖలో నగదు రహిత సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.
అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణా శాఖలో నగదు రహిత సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్లు రద్దు నిర్ణయంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డీటీసీ సుందర్‌వడ్డీ మంగళవారం విజయవాడ నుంచి స్వైప్ మిషన్లు తెప్పించారు. అనంతపురం, హిందూపురం ఆర్టీఓ కార్యాలయాలతో పాటు పెనుకొండ చెక్‌పోస్టులో వీటిని ప్రారంభించారు.
డీటీసీ సుందర్‌వడ్డీ మాట్లాడుతూ వాహనదారులు క్రెడిట్‌కార్డు, రూపే కార్డులను వినియోగించి సేవలను పొందవచ్చునన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో స్వైప్ మిషన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. అన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, కార్లు, జీపుల నిర్వాహకులు కూడా స్వైపు మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే 15 బస్సు ట్రావెల్స్ నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలినవాటిలో త్వరలోనే ఏర్పాటు చేయిస్తామన్నారు.