వీఎస్‌యూ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు
Published Tue, Jul 26 2016 11:56 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(టౌన్) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కళాశాలకు ప్రథమసంవత్సర విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో ర్యాంగింగ్‌ను అరికేట్టేందుకు, తరగతులు నిర్వహణ, విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్లు వీఎస్‌యూ అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవల కాలంలో వర్సిటీలో పలు సమస్యలపై విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారని తెలిసింది.
Advertisement
Advertisement