- టీఆర్‌ఎస్ జిల్లా చీఫ్ ‘తక్కళ్లపల్లి’
సంబరాలు అంబరాన్నంటాలి
Published Tue, Aug 23 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
హన్మకొండ : గోదావరి నదీ జలాల వినియోగంపై మహారాష్ట్రతో నేడు ప్రభుత్వం చేసుకునే చారిత్రక ఒప్పందంతో పాటు జిల్లాల పునర్విభజన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన నేపథ్యంలో సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకోవాల ని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షాభావంతో బీళ్లుగా మారుతున్న భూములను గోదావరి నదీ జలాల వినియోగంతో సాగులోకి తేవడానికి సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సర్కారు తరఫున సీఎం దేవేంద్ర పడ్నవీస్ మధ్య మంగళవారం(23న) మధ్యాహ్నం మూడు గంటలకు చారిత్రక ఒప్పందం జరగనుం దని చెప్పారు. ఈ గొప్ప కార్యక్రమంతో వరంగల్ జిల్లాయే ఎక్కువగా లబ్ధిపొందుతుందని, మహా రాష్ట్రతో చేసుకునే ఒప్పందంతో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తవుతాయని తెలిపారు. జిల్లాలోని కరువు ప్రాంతాలు సస్యశ్యాలం అయ్యేందుకు ఇది ఉపయోగడుతుందని చెప్పారు. ఈ ఒప్పందం జరగగానే.. జిల్లా అంత టా భారీగా సంబరాలు జరుపుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 24న రాష్ట్రానికి వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు జిల్లాలోని టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివెళ్లాలని కోరారు. టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలో పేర్కొన్న ప్రకారం జిల్లాల పునర్విభజన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా అంతటా సంబరాలు నిర్వహించాలని సూచరించారు.
Advertisement