districts reorganisation
-
మూడేళ్లయినా ఖరారు కాని జిల్లా కేంద్రం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటై ఈ దసరాతో మూడేళ్లవుతున్నా.. జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఖరారు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు కలెక్టరేట్ సముదాయాలు చివరి దశలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా రూరల్ జిల్లా కేంద్రం ఉండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. -
ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో తగ్గిన దూరభారం
సాక్షి, ఆసిఫాబాద్: దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఆవిర్భావించి ఈ దసరాతో మూడేళ్లు కావస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలను వేరు చేస్తూ పోరాటయోధుడు కుమురం భీం పేరు మీదుగా కొత్త జిలాను ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతవాసులకు కొత్త జిల్లా ఏర్పాటుతో పాలన మరింత చేరువైంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోయినా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో మాత్రం బీజం పడింది. కుమురం భీం జిల్లా ఆవిర్భావించడంతో ప్ర ధానంగా దూర భా రం సమస్య తీరినట్లయింది. మారుమూల ప్రాంతమైన బెజ్జూరు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఒక రోజు ముందు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా ఏర్పాటుతో ఈ తిప్పలు తప్పాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చిట్టచివరి ప్రాంతాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉండేది. ప్రస్తుతం రెండు నియోజవర్గాలతో కలెక్టర్, ఎస్పీ నేరుగా మారుమూల ప్రాంతాలకు వెళ్లడంతో పాటు పర్యవేక్షణ పెరిగింది. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం.. కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానికులకే ఉద్యోగాల్లో 90 శాతం అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జిల్లాలో జరిగిన కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ఇతర వివిధ శాఖల్లో తాత్కాలిక పోస్టుల్లోనూ జిల్లాలో స్థానిక నిరుద్యోగ యువతకే అవకాశం కలిగింది. ఇక జిల్లా ఏర్పాటుతో భవిష్యత్‌లోనూ స్థానిక నిరుద్యోగులకు ఈ రిజర్వేషన్ పద్ధతి కొనసాగనుంది. అభివృద్ధికి అడుగులు.. కొత్త జిల్లా ఏర్పాటుతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా లింగాపూర్, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట మూడు మండలాలు ఏర్పడ్డాయి. చిన్న మండలాలతో పాలన మరింత సులభమవుతోంది. అలాగే కొత్తగా తహసీల్, ఎంపీడీవో, పోలీసు స్టేషన్, తదితర మండల కార్యాలయాలన్నీ రావడంతో పాలనలో ఫోకస్ పెరిగింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమీకృత భవనాల నిర్మాణాలు, పోలీసు కార్యాలయాల నిర్మాణాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రం కావడంతో ప్రతి శాఖకు సంబందించిన కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వైద్య సేవల్లో సామాజిక ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడం, మహిళల భద్రత కోస సఖీ కేంద్రం తదితర శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. పరిపాలనపై మరింత పట్టు పెరిగింది. సొంత జిల్లాల్లోనే బదిలీలకు ఆస్కారమేర్పడింది. కేంద్రం కొత్త జిల్లాల ప్రతిపాదికనే ఇటీవల నిధులు మంజూరుకు సుముఖం తెలపడంతో ఇక నుంచి మరింత ప్రగతి ఆశించవచ్చు. అరకొర వసతులు.. గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు, కార్యాలయాలకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతం కావడంతో అధికారులకు సరైన మౌలిక వసతులు లేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తోంది. జిల్లా ఏర్పడిన నుంచి అరకొర సిబ్బందితోనే పాలన సాగుతోంది. ఇప్పటికీ అన్ని శాఖల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులకు జిల్లా కేంద్రంలో ఆవాస యోగ్యం లేకపోవడంతో కాగజ్‌నగర్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ హెచ్ఆర్ఏ తక్కువగా ఉండడంతో కొందరు ఉద్యోగులు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని వెళ్తున్నారు. ప్రధానంగా గడిచిన మూడేళ్లలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి రాలేదు. డీఎంహెచ్‌వో కార్యాలయంతో పాటు చాలా వరకూ కార్యాలయాలు ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోడ్డు డివైడర్లు నిర్మించారు. ఏజెన్సీలో నేటికీ అనేక గ్రామాలకు సరైన రోడ్డు వసతి లేదు. పలు సమస్యలు ఉన్నప్పటికీ జిల్లా ఏర్పాటుతో ఎంతో మేలు జరిగినట్లయిందని ప్రజలు తెలుపుతున్నారు. విద్యా వ్యవస్థ మెరుగుపడాలి కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లాకు కొన్ని గురుకులాలు మంజూరయ్యాయి. ఇది స్వాగతించాల్సిన విషయమే అయినా జిల్లాలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో ప్ర భుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు ఏర్పా టు చేయాలి. గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. – దుర్గం రవీందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు నూతన జిల్లాగా ఏర్పడినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు దూరభారంతో ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం దూరభారం తగ్గినా చాలా వరకూ పనులు జరగడం లేదు. కాగజ్‌నగర్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేసినా గతంలో ఉన్న పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది. అనేక సమస్యలు పరిష్కారానికి నోచడం లేదు. – సిందం శ్రీనివాస్, కాగజ్‌నగర్ పరిపాలన సౌలభ్యం పెరిగింది కుమురం భీం జిల్లా ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వ శాఖలు, అధికారులు అందుబాటులోకి వచ్చారు. గతంలో ఆదిలాబాద్‌కు వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలా వ్యయప్రయాసలకు గురికావాల్సి వచ్చేంది. కాని కుమురం భీం జిల్లా ఏర్పాటుతో చాలా వరకూ పరిస్థితి మారింది. శాఖల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ సైతం పెరిగింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. – బొమ్మినేని శ్రీధర్, రెబ్బెన అభివృద్ధికి బాటలు పడ్డాయి.. నూతనంగా జిల్లా, మండలాల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడ్డాయి. గతంలో జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో ఇబ్బందులకు గురయ్యాం. నూతన మండలాల ఏర్పాటుతో రవాణా ఇబ్బందులు తీరాయి. పరిపాలన సౌలభ్యంగా మారింది. ప్రభుత్వపరమైన పథకాలు, కార్యక్రమాల సమాచారం తెలుసుకుకోవడం నూతన మండలాలతో అందుబాటులోకి వచ్చింది. – సయ్యద్ అజీమ్, చింతలమానెపల్లి సేవలు అందుబాటులోకి చింతలమానెపల్లి మండలంగా ఏర్పడక ముందు గూడెం, డబ్బా, ఖర్జెల్లి, దిందా, అడెపల్లి, కేతిని, రుద్రాపూర్ గ్రామాలకు వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేంది. చింతలమానెపల్లి కొత్త మండలంగా ఏర్పాటు కావడంతో చాలా వరకూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరనే ఉన్నాయి. నూతన పంచాయతీలతో సౌలభ్యంగా ఉంది. మండల కేంద్రంలో అన్ని కార్యాలయాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలకు మెరుగైన సేవలందించాలి. – కుమ్మరి హరీశ్, చింతలమానెపల్లి -
కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి నేటికి మూడేళ్లు
జిల్లాల పునర్విభజనతో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజలకు పాలన చేరువైంది. సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగింది. అభివృద్ధి సైతం జోరందుకుంది. మారుమూల ప్రాంతాల కూ జిల్లా స్థాయి అధికారులు వెళ్లి వస్తున్నారు. సమీకృత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల నిర్మాణ పనులు జిల్లాలో దాదాపుగా పూర్తికావచ్చాయి. కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి మూడేళ్లవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, కామారెడ్డి: పాలనను ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను పున ర్విభజించింది. ఆ తరువాత కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. 2016 అక్టోబర్ 11న కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించింది. గతంలో జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో జిల్లా యంత్రాంగం అన్ని ప్రాంతాలను తిరగడం ఇబ్బందికరంగా ఉండేది. ఒక్కో ప్రాంతానికి ఏడాదికోమారు కూడా వెళ్లే పరిస్థితులు ఉండేవి కాదు. జిల్లాల పునర్విభజనతో ప్రజలకు పాలన చేరువైంది. కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు తరచూ అన్ని మండలాలను చుట్టి వస్తున్నారు. అభివృద్ధి పనుల పరిశీలన, సంక్షేమ పథకాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది. ప్రతి వారం పథకాల అమలుపై సమీక్షిస్తున్నారు. కలెక్టర్ సత్యనారాయణ సెలవు రోజుల్లో సైతం జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పరిశీలించి వస్తున్నారు. దీంతో పథకాల అమలులో పారదర్శకత పెరిగింది. వారంవారం ప్రజావాణి... కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులంతా ప్రజావాణికి హాజరై ప్రజల విన్నపాలను వింటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో దాదాపు 8 వేలకు పైగా అర్జీలు వచ్చాయి. అందులో చాలా వాటికి పరిష్కారం చూపారు. జిల్లా కేంద్రానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరాన ఉన్న జుక్కల్ నియోజక వర్గ ప్రజలు జిల్లా కేంద్రానికి రావడం ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి నెల మొదటి శనివారం బిచ్కుంద మండల కేంద్రం లో కలెక్టర్ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సత్యనారాయణతోపాటు జిల్లా అధికారులంతా ప్రజావాణికి హాజరై ప్రజల సమస్యలను విని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ శ్వేత కూడా బిచ్కుందలో నెలకోరోజు సమయం కేటాయిస్తూ అక్కడి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో కలెక్టర్ ప్రతి రోజూ ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతున్నారు. పథకాల అమలులో ప్రత్యేక ముద్ర కామారెడ్డి జిల్లా వివిధ పథకాల అమలులో ముందంజలో ఉంటోంది. ఉపాధిహామీ, హరితహారం, గొర్రెల పంపిణీ, భూముల రికార్డుల ప్రక్షాళన, భూగర్భజలాల వృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల అమలులో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. కలెక్టర్, జేసీ క్యాంపు కార్యాలయాలు పూర్తి సమీకృత కార్యాలయాల ప్రాంగణంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ల కోసం చేపట్టిన భవనాలు నిర్మాణం పూర్తయ్యింది. మూడు నెలల క్రితమే వాటిని ప్రారంభించారు. అధికారులు ఆయా క్యాంపు కార్యాలయాల్లోనే నివాసం ఉంటున్నారు. కలెక్టర్, జేసీతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ తమ కార్యకలాపాలను అక్కడి నుంచే సాగిస్తున్నారు. కొత్త డివిజన్, మండలాల్లో ఇబ్బంది జిల్లాతో పాటే ఏర్పాటైన కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, కొత్త మండలాల్లో కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయగా.. ఆర్డీవోలు, డీఎస్పీ కార్యాలయాలకు సరైన వసతులతో కూడిన భవనాలు లభించలేదు. ఇప్పటికీ భవనాలకు నిధులు మంజూరు కాలేదు. దీంతో ఆయా కార్యాలయాలకు సొంత భవనాలు ఎప్పుడు నిర్మిస్తారోనని ఎదురుచూడాల్సి వస్తోంది. సిద్ధమవుతున్న సమీకృత భవనాలు 2016 అక్టోబర్ 11న విజయ దశమి రోజున కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన మైనారిటీ గురుకుల పాఠశాలలో, జిల్లా పోలీసు కార్యాలయాన్ని అడ్లూర్ రోడ్డులోని గిరిజన విద్యార్థి వసతి గృహ భవనంలో ఏర్పాటు చేశారు. ఏ జిల్లాలో లేని విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, పోలీసు కార్యాలయాలకు అన్ని వసతులతో కూడిన భవనాలు దొరకడంతో పాలనకు ఏ ఇబ్బందీ లేకుండాపోయింది. మూడేళ్లుగా ఆ భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కాగా జిల్లా ఏర్పాటైన ఏడాదికి 2017 అక్టోబర్ 11న జిల్లా కలెక్టరేట్‌తో పాటు జిల్లా పోలీసు కార్యాలయాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణానికి ఆనుకుని ఉన్న అడ్లూర్ శివారులోని 427 సర్వేనంబరులో 90 ఎకరాల్లో అటు కలెక్టరేట్ సముదాయం, ఇటు పోలీసు కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టారు. కలెక్టరేట్ సముదాయానికి రూ. 44 కోట్లు మంజూరు కాగా, రోడ్లు భవనాల శాఖ పనులను అప్పగించారు. జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరు కాగా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ పనులను పర్యవేక్షిస్తోంది. సమీకృత భవనాల నిర్మాణ పనులు జిల్లాలో వేగంగా సాగాయి. ప్రస్తుతం జిల్లా పోలీసు భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలకన్నా ముందుగా కామారెడ్డిలోని పోలీసు కార్యాలయ భవనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముందుగా పూర్తయితే సీఎంతో ప్రారంభించా లని అప్పట్లో భావించారు. అయితే ముందస్తు ఎన్నికలు రావడంతో వాయిదాపడింది. ప్రస్తుతం పోలీసు కార్యాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది. కాగా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులూ వేగంగా కొనసాగుతున్నాయి. భవనాల నిర్మా ణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే కార్యాలయ ప్రాంగణానికి రోడ్ల నిర్మాణం, ఫర్నిచర్ కొనుగోలు కోసం నిధుల సమస్య ఏర్పడింది. నిధులు మంజూరైతే నెల రోజుల్లో భవనాలను ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యాం జిల్లాల పునర్విభజన తరువాత అన్ని ప్రాంతాలపై పర్యవేక్షణ సులువైంది. పలు కార్యక్రమాలు, సంస్కరణలతో పోలీసులు ప్రజలకు దగ్గరయ్యారు. మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి ప్రజలతో మమేకమవుతున్నాం. ప్రజలు కూడా పోలీసులతో అన్నీ చెప్పుకుంటున్నారు. ప్రజల సహకారంతో సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేశాం. వాటి ద్వారా నేరాల సంఖ్య తగ్గింది. నేరస్తులను పట్టుకోవడం కూడా సులువైంది. అన్ని శాఖల అధికారుల కోఆర్డినేషన్‌తో ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. – శ్వేత, ఎస్పీ -
కొత్త ఆశలు..!
రాజకీయ నిరుద్యోగులు, రిజర్వేషన్లు అనుకూలించక పాలిటిక్స్నుంచి దూరమైన వారు, ఆర్థికంగా ఉన్నవారి కన్ను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కానున్న నగర, గ్రామ పంచాయతీలపై పడింది. ఒక్కసారైనా ప్రజాప్రతినిధి కావాలన్న ఆశతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో విందులు, వినోదా లకు తెరలేపడమే కాకుండా రాజకీయబేరసారాలకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు రిజర్వేషన్లు దడ పుట్టిస్తున్నప్పటికీ.. అనుకూలంగా రాకపోతే తాము చెబితే వినే వ్యక్తులను బరిలో నిలిపేందుకు ఎత్తులు వేస్తున్నారు. మొత్తంగా స్థానిక పదువులపై ఆశలు పెట్టుకున్న వారందరూ ఎన్నికల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, యాదాద్రి : నూతన చట్టం ద్వారా కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఏర్పడనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ హడావుడి మొదలైంది. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకం కానున్నాయి. ఎంతో కాలంగా స్థానిక పదవులపై ఆశలు పెట్టుకున్న వారందరూ రిజర్వేషన్ల ఖరారు ఎలా ఉంటుందోనన్న ఆత్రుతతో ఉన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి అన్ని ఎన్నికల్లో 50శాతం మహిళలకు రిజర్వ్ చేస్తారు. మున్సిపల్, నగర, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్నింటిల్లో 50 శాతం ఆయా కేటగిరీల వారీగా కేటాయిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల యధావిధిగా కొనసాగుతాయా లేక కొత్త రిజర్వేషన్లు రూపొందిస్తారా.. అనే విషయం అంతు చిక్కడం లేదు. నూతన చట్టం అమలులోకి రాగానే నిర్ణీత సమయంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కసరత్తు ఎప్పుడో ప్రారంభించింది. శాసనసభలో బిల్లు ఆమోదం పొందగానే∙గిరిజన తండాలు, మధిర గ్రామాలు కొత్త గ్రామ పంచాయతీలుగా పురుడుపోసుకోబోతున్నాయి. 2018, ఆగస్టు 1 వ తేది నాటికి గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుంది. పునర్విభజన నేపథ్యంలో.. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం రూపు రేఖలు మారాయి. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. అయినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీల పరంగానే జరుగుతాయి. 2013లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రం ఏర్పాటు అనంతరం నూతన జిల్లాల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ నుంచి విడివడిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా 16 మండలాలతో ఏర్పాటైంది. ఇందులో మోటాకొండూరు, అడ్డగూడురు రెండు కొత్త మండలాలు ఏర్పాటు అయ్యాయి. ఆశావాహుల్లో రిజర్వేషన్ గుబులు ఎలాగైనా సరే.. ఒక్కసారైనా ప్రజాప్రతినిధిని కావలన్న ఆశతో ఉన్నవారికి రిజర్వేషన్ దడ పట్టుకుంది. గ్రామ పంచాయతీల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విభాగాల్లో మహిళ, జనరల్ రిజర్వేషన్లు ఉంటాయి. వీటితో పాటు మహిళలకు సర్పంచ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఉండనే ఉన్నాయి. అంటే మొత్తం గ్రామ పంచాయతీల్లో అన్ని రిజర్వేషన్లు కలుపుకుని 50 శాతం మహిళలు సర్పంచ్‌లు అవుతారు. రిజర్వేషన్లు అనుకూలించగా రాజకీయాల నుంచి దూరమైన వారు ఉన్నారు. ఈనేపధ్యంలో ఈసారి మన గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ఏమై ఉంటుందన్న చర్చ రచ్చబండల వద్ద జోరుగా సాగుతోంది. ఈ రిజర్వేషన్ అయితే ఇతను పోటీ చేస్తాడు. ఆరిజర్వేషన్ అయితే అతను పోటీ చేస్తాడు అన్నకోణంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆశావాహులు విందు వినోదాలకు తెరలేపారు. ఎలా ఎదుర్కొవాలి.. తమకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చే విధంగా చూడాలని ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ గత రిజర్వేషన్లు ఈసారి యధావిధిగా కొనసాగుతాయన్న ప్రచారం జోరందుకుంది. పాత రిజర్వేషన్లు ఉంటే ఎలా ముందుకుపోవాలని, లేదంటే కొత్త రిజర్వేషన్లు వస్తే ఎలా ఎదుర్కొవాలని అందుకు అనుగుణంగా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థుల ఎంపికను గుట్టుచప్పుడు కాకుండా ఖరారు చేస్తున్నారు. ఏది ఏమైనా శాసనసభలో ప్రవేశపెట్టే స్థానిక సంస్థల బిల్లు రానున్న ఎన్నికల్లో ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రసాదించబోతోంది. పావులు కదుపుతున్న రాజకీయ పార్టీలు.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. మున్సిపాలిటీ, నగరపంచాయతీ, గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ వంటి పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో కొద్ది తేడాలో ఓటమి పాలైన పలువురు ఈసారి ఎన్నికల్లో ఎన్నికల్లో ఎలాగైనా పదవిని అధిష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ఈమేరకు గ్రామాల్లో రాజకీయ రాయబారాలు మొదలుపెట్టారు. చిన్న చిన్న వివాదాలు పరిష్కరించుకుంటున్నారు. అనుకూల వర్గంతోపాటు, ప్రతికూల వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చిన్న చిన్న శుభకార్యాలను కూడా పెద్ద ఎత్తున చేస్తూ బంధువులు, శ్రేయోభిలాషులు, వివిధ వర్గాలను ఆహ్వానించి పోటీ చేయాలన్న తమ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. -
‘సహకారం’ పొడిగింపు
సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు నిర్వహించే ఈ దఫా ఎన్నికలకు బ్రేక్ పడింది. పీఏసీఎస్ పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (డీసీఎంఎస్)ల పదవీ కాలాన్ని కూడా మరో ఆరు నెలలు పాటు పొడిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ కార్యదర్శి సి. పార్థసారథి జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు 2013లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 2018 జనవరి 30తో పాలక వర్గాల పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై రెండు నెలలుగా సందిగ్దం నెలకొంది. అయితే తాజాగా పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు చేస్తూ సర్కారు ఆదేశాలివ్వడంతో సందిగ్దానికి తెరపడింది. ఉన్నవే కొనసాగింపు.. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఇవి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఆయా జిల్లాల పరిధిలో ఉన్నాయి. కానీ వీటన్నింటికీ ఒకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఒకే మార్కెటింగ్ సంఘం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించినట్లైతే వాటి పరిధిలోని డీసీసీబీలకు, డీసీఎంఎస్‌లకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నాలుగు జిల్లాలకు ఒకే డీసీసీబీ, డీసీఎంఎస్ ఉంది. నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు డీసీసీబీ, డీసీఎంఎస్‌లను ఏర్పాటు చేస్తే తప్పా.. ఎన్నికలు నిర్వహించడమనేది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు తప్పా.. వేరే మార్గం లేకపోవడంతో ప్రభుత్వం ఈ రకంగా ముందడుగేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీ కాలాన్నే మరో ఆరు నెలల పాటు పొడిగించింది. వీటితో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల పదవీ కాలం కూడా పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలే మరో ఆరు నెలల పాటు కొనసాగనున్నాయి. అప్పుడు మేనేజ్మెంట్.. ఇప్పుడు పర్సన్ ఇన్చార్జి.. ఎన్నికల సమయంలో రైతులతో ఎన్నుకోబడిన పాలకవర్గాలను మేనేజ్మెంట్ కమిటీగా పిలుస్తారు. పదవీ కాలం ముగిసిపోయి ప్రభుత్వం పొడిగింపు చేస్తే ఆ కమిటీ అధ్యక్షుడిని పర్సన్ ఇన్‌చార్జీగా పిలవడం జరుగుతుందని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంటే పదవీలో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న వారే ఇప్పుడు పీఏసీఎస్‌కు పర్సన్ ఇన్చార్జి అన్నమాట. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 52 పాత మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడు సహకార శాఖ డివిజన్లు ఉన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ డివిజన్లలో మొత్తం 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలుపొందిన డైరెక్టర్లు, సహకార శాఖ కార్యదర్శులు ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న డైరెక్టర్ల పదవీ కాలం జనవరి 30తో పూర్తయింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం తప్పని చర్యగా ఇలా చేపట్టినట్లు తెలుస్తోంది. వివరాలు కోరిన ప్రభుత్వం.. పీఏసీఎస్ పాలక వర్గాల పనితీరుపై జిల్లా సహకార శాఖను ప్రభుత్వం వివరణ కోరింది. పీఏసీఎస్‌లకు ఉన్న పాలక వర్గాల వివరాలు, అందులోని సభ్యులు, సొసైటీ నుంచి పొందిన రుణాలు, తిరిగి రుణాలు చెల్లిస్తున్న సభ్యు ల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఫారం–1, ఫా రం–2ను పూర్తి చేసి రెండు రోజుల్లో సమర్పించాలని సహకార శాఖ అధికారులను ఆదేశించింది. పాలకవర్గాల పనితీరును దృష్టిలో ఉంచుకొని ఎవరికి పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించాలనే దానిపై ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టత ఇవ్వనుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొన్ని సంఘాల్లోని సభ్యులు సొసైటీ నుంచి పంట రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కట్టలేదు. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రతి ఏడాది సొసైటీ నుంచి రుణాలు తీసుకుంటున్న, తిరిగి చెల్లిస్తున్న సభ్యుల వివరాలు తెలియజేయాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో అధికారులు ఆ వివరాల సేకరణలో తలామునకలవుతున్నారు. పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలక వర్గాల పదవీకాలం పూర్తి కావడంతో వాటికి పర్సన్ ఇన్చార్జీలను నియమించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు నియమించే పర్సన్ ఇన్చార్జీలు ఫిబ్రవరి నుంచి 3 నుంచి కొనసాగుతారు. ఈ రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఆదేశించిన కొన్ని వివరాలను సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యాం. ఆదేశాల ప్రకారం పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తాం. – మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్ -
మార్పు, చేర్పులకు నో ఛాన్స్
-
మార్పు, చేర్పులకు నో ఛాన్స్
హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవన్యూ డివిజన్లు, మండలాలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయని తెలిపింది. ప్రజల విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించింది. ఇకపై జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన కేంద్రాల నుంచే పాలన జరుగుతుందని పేర్కొంది. కొత్త డిమాండ్లను పరిశీలించే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. మార్పు, చేర్పులకు అవకాశం లేదని తెలంగాణ సర్కారు వెల్లడించింది. కాగా, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగలేదన్న వాదనలు ఇంకా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. దసరా సందర్భంగా మంగళవారం తెలంగాణలో 21 కొత్త జిల్లాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
రిజిస్ట్రేషన్లు రయ్ రయ్!
కొత్త జిల్లాల నేపథ్యంలో పెరిగిన క్రయ విక్రయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత ఆర్నెల్లలో భూముల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భారీగా భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. మొత్తంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గత ఆరు నెలల్లో దాదాపుగా రూ.2 వేల కోట్లకు చేరువైంది. గతేడాది ఇదే సమయానికన్నా ఇది 31.21 శాతం ఎక్కువ కావడం గమనార్హం. మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికంగా 30 నుంచి 48 శాతం దాకా ఆదాయం పెరగగా... మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు పెరుగుదల కనిపించింది. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా తగ్గిపోవడం విశేషం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రూ.వందల కోట్లలో ఆదాయం పెరిగింది. ప్రభుత్వం గత నాలుగేళ్లుగా భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచకున్నా.. ఏటా ఆదాయం గణనీయంగా పెరుగుతుండడం పట్ల రిజిస్ట్రేషన్ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఇదే తరహా పెరుగుదల కొనసాగితే ఈ ఏడాది వార్షిక (రూ.4,292 కోట్లు) లక్ష్యాన్ని సులువుగానే చేరుకోగలమని ఉన్నతాధికారులు చె బుతున్నారు. -
ముహూర్తం ఖరారు
దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు ప్రముఖుల చేతుల మీదుగా కార్యక్రమాలు భూపాలపల్లి : శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి జనగామ : శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వరంగల్ రూరల్ : ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మహబూబాబాద్ మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షిప్రతినిధి, వరంగల్ : పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ముహూర్తం ఖరారైంది. దసరా రోజున కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరగనుంది. కొత్త జిల్లాలను ప్రారంభించే ప్రజాప్రతినిధుల పేర్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉన్న కీలక నేతలు కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్(భూపాలపల్లి) జిల్లాను ప్రారంభిస్తారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ జనగామ జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ రూరల్ జిల్లాను ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందులాల్ మహబూబాబాద్ జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలూ ఉండవు. కొత్త జిల్లాల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు సైతం కొత్త జిల్లాల ఏర్పాటు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. -
కొత్త జిల్లాల్లో దసరాకు సెలవు నో
- పునర్విభజనతో సంబంధమున్న ఉద్యోగులకు వర్తింపు - ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దసరా పండుగ రోజున ఉద్యోగులు విధిగా విధులకు హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రోజున కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నందు న సెలవును రద్దు చేసింది. జిల్లాల పునర్విభజనతో సంబంధ మున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల ప్రారంభం రోజున ఉదయం 10:30 గంటలకల్లా కలెక్టరేట్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా వర్క్ టు సర్వ్ ఆర్డర్లను అందజేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉద్యోగులకు వర్తించేలా సింగిల్ ఆర్డర్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక పునర్విభజన పరిధిలోకి రాని ఉద్యోగులు సోమవారం (10వ తేదీ) ఐచ్చిక సెలవును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. వేడుకలు నిర్వహించండి నూతన జిల్లా, డివిజన్, మండలాలకు అవసరమైన ఫైళ్లు, స్టేషనరీ, ఫర్నిచర్ ఇతర సరంజామాను ఆయా కార్యాలయాలకు తక్షణం చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆవిర్భావ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యమైన ఫైళ్లను మాత్రం మాతృ (ప్రస్తుత) జిల్లా కార్యాలయాల్లోనే ఉంచాలని.. పరిపాలన కుదుటపడ్డాక సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాలని పేర్కొంది. నూతన మండలాల్లో ఆవిర్భావ వేడుకలను ఇన్చార్జి అధికారులు నిర్వహించాలని కోరింది. కొత్త జిల్లాలకు కొత్త వెబ్సైట్, ఫేస్బుక్ ఖాతాలను అదే రోజున ఆవిష్కరించాలని స్పష్టం చేసింది. తొలి రోజునే పని విభజన జిల్లాల ఆవిర్భావం రోజునే ఏ అధికారి ఏ విధులు నిర్వహించాలి, ఏయే విభాగం ఏయే దస్త్రాలను పరిశీలించాలన్న అంశంపై పని విభజన జరగాలని సర్కారు ఆదేశించింది. దానివల్ల ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం ఉండదని స్పష్టం చేసింది. ప్రజల నుంచి అందే అర్జీలను పరిష్కరించేందుకు సిటిజన్ చార్టర్ అమలు పక్కాగా జరిగేం దుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇక మండలాలను ఏ, బీ, కేటగిరీ లుగా విభజించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించనుంది. ‘ఏ’ కేటగిరీలోని మండలాలకు ఉద్యోగుల కేటాయింపులో కోత ఉండదు. బీ కేటగిరీ మండలాలకు సిబ్బందిని కుదించనున్నారు. ఆయా మండలాలకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఉండదని అధికారవర్గాలు తెలిపాయి. -
వరంగల్ రీజియన్‌లోనే కొత్త జిల్లాలు
అదనంగా యాదగిరి, హుజూరాబాద్ డిపోల చేరిక ఖమ్మం రీజియన్‌లోకి మహబూబాబాద్, తొర్రూరు డిపోలు హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో ఆర్టీసీలో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత రీజియన్‌లోని కొత్త జిల్లాల్లో ఆర్టీసీ సేవలు అందించనుంది. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నా ఆ మేరకు నూతనంగా డిపోలు ఏర్పాటు కావడంలేదు. దీంతో ప్రస్తుత రీజియన్‌లోని కొత్త జిల్లాల్లోనే డిపోలు తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాను యూనిట్‌గా ఆర్టీసీ పరంగా రీజియన్‌గా పరిగణిస్తున్నారు. వరంగల్ జిల్లాలో (రీజియన్‌లో) ప్రస్తుతం 9 డిపోలు ఉన్నాయి. హన్మకొండలో వరంగల్-1, వరంగల్-2, హన్మకొండ డిపోలు ఉన్నాయి. జనగామ, పరకాల, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబాద్, భూపాలపల్లిలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలోకి హన్మకొండలోని వరంగల్-1, వరంగల్-2, హన్మకొండ డిపోలతోపాటు, కొత్తగా హుజూరాబాద్ డిపో రానుంది. వరంగల్ జిల్లాలో పరకాల, నర్సంపేట డిపోలు ఉంటాయి. ఇక జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలో భూపాలపల్లి డిపో ఉంది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, తొర్రూరు డిపోలు ఉంటాయి. ప్రస్తుతం వరంగల్ రీజియన్‌లో ఉన్న జనగామ డిపో ప్రాంతం యాదాద్రి జిల్లాలో కలువనుండగా, ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ డిపో ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలోకి వస్తుంది. హన్మకొండ - హైదరాబాద్ రూట్ ఒకే రీజియన్ పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. దీంతో ప్రతిపాదిత యాదాద్రి జిల్లాలోని యాదగిరి గుట్ట డిపో, జనగామ డిపో వరంగల్ రీజియన్‌లోనే ఉంచాలనే ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. హుజూరాబాద్ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు ఒకే రీజియన్ పరిధిలో ఈ రూట్ ఉండడం ద్వారా పర్యవేక్షణతోపాటు బస్సుల ఫ్రీక్వెన్షీ పరంగా నిర్ణయం తీసుకోవడం సులువవుతుందనే ఆలోచనతో ఆర్టీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాలనాపరంగా యాదగిరిగుట్ట, జనగామ డిపోలకు వరంగల్ కేంద్రంగా ఉండడం అనుకూలంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ రూట్లో ప్రధానంగా ప్రస్తుత వరంగల్ జిల్లా పరిధిలోని బస్సులే అధికసంఖ్యలో నడుస్తున్నాయి. వరంగల్ జిల్లాలో విభజించిన నాలుగు జిల్లాల్లో వరంగల్ రీజియన్ పరిధిలోని బస్సులే ఈ రూట్లో నడుస్తాయి. ఇతర రీజియన్ల బస్సులకు ఏమాత్రం అవకాశం లేదు. ఈ క్రమంలో ఈ రూట్‌ను ఒకే గొడుగు కింద ఉండేలా యాదగిరిగుట్ట, జనగామను వరంగల్‌లో రీజియన్‌లో కొనసాగించాలనేది ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన. రీజియన్‌లోకి యాదగిరిగుట్ట, హుజూరాబాద్ డిపోలు రానుండగా, కొత్త జిల్లాల ఏర్పాటుతో మహబూబాద్ జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు డిపోలు ఖమ్మం రీజియన్‌లో కలుపనున్నట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లాలోకి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు కలుస్తున్నాయి. ఈ క్రమంలో పాలనాపరంగా మçహబూబాబాద్ జిల్లాలోని డిపోలకు ఖమ్మం రీజియన్‌లో ఉండడం సౌలభ్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తొర్రూరు డిపోకు వరంగల్ రీజియన్ అనుకూలంగా ఉన్న జిల్లా పరంగా ఒక డిపో ఖమ్మం రీజియన్‌లో, ఒక డిపో వరంగల్ రీజియన్‌లో ఉంటే ఇబ్బందులు తలెత్తనున్నాయని భావిస్తున్న అధికారులు మహబూబాద్ జిల్లాను ఆర్టీసీ పరంగా ఖమ్మం రీజియన్‌లో ఉంచాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. అయితే సిబ్బంది అంశంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికుల నియామకం రీజియన్ల వారీగా చేపట్టడంతో సీనియారిటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఉద్యోగులకు, కార్మికులకు ఆప్షన్ అవకాశం ఇవ్వాలా? నియామకం పొందిన జిల్లాలోనే కొనసాగించాలా? ఆనే ఆలోచనలో యాజమాన్యం ఉంది. -
విభజన వివరాలు ఆన్లైన్లో నమోదు
హన్మకొండ అర్బన్ : నూతనంగా జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు తమ శాఖ వివరాలు మెుత్తం కొత్తగా రూపొందించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని జిల్లా జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో విభజన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమైన 63 ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇచ్చారని, వాటి ద్వారా లాగినై పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. నమోదుకు సంబందించి బుధవారం సిబ్బందితో మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏజేసీ, డీఆర్వో ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్య సాంకేతిక శాఖలో భారీ మార్పులు
వరంగల్ అర్బన్ : జిల్లాల పునర్విభజనతో పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూ తనంగా ఏర్పడే జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఇంజనీర్ల కేటాయింపు కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది. ఈ మేరకు వరంగల్ రీజినల్ పబ్లిక్ హెల్త్ ము న్సిపల్ ఇన్చార్జ్ ఎస్ఈ రాజేశ్వర్‌రావు ప్రతిపాదనలు రాష్ట్ర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ధన్సింగ్కు నివేదించారు. పబ్లిక్ హెల్త్ మునిసిపల్ ఇంజినీరింగ్ శాఖ వరంగల్ రీజియన్ పరిధిలో వరంగ ల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల కేంద్రాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల పరిధి లో ఒక గ్రేటర్ కార్పొరేషన్, రెండు మునిసిపల్ కార్పొరేషన్లు, 31 మునిసిపాలిటీలు, నగర పం చాయతీలు ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు మునిసిపాలిటీల్లో, మునిసిపల్ ఇంజినీర్లు నగర పంచాయతీల్లోని తాగునీటి శుద్ధి, సరఫరా, రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తుంటారు. అంతేకాకుండా ముసాయిదాలోని 12 జిల్లాల పరిధిలో గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లలో తాగునీరు, ఫిల్టర్బెడ్ల నిర్మాణం లాంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టనున్న పనులను పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తుంటారు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఇంజినీర్లకు కార్పొరేషన్ల నుంచి మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు బదిలీ లు ఉంటాయి. తాజాగా జిల్లాల పునర్విభజనతో నాలుగు జిల్లాలు పరిధిలో ఖమ్మం, కొత్తగూడెం, మానుకోట, జయశంకర్(భూపాలప ల్లి), వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, కొమురంభీం జిల్లా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలుగా విస్తరించనున్నారు. రీజినల్ కార్యాలయంపై స్పష్టత కరువు వరంగల్ కేంద్రంగా ఉన్న రీజినల్ కార్యాలయంపై కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యాక భవితవ్యం తేలుతుందని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఆరు జిల్లాలకు కలిసి ఒక రీజినల్ కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినవస్తున్నాయి. లేనియెడల ఆర్డీ కార్యాలయాన్ని ఎత్తివేసి, హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది. నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
వరంగల్ ఆర్టీఏలోనే హన్మకొండ కార్యాలయం
ఖిలావరంగల్ : జిల్లాల పునర్విభజనతో వరంగల్ ఆర్టీఏ కార్యాలయం నాలుగు ముక్కలుగా చీలనుంది. కొత్తగా మూడు జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. వరంగల్ ఆర్టీఏ కార్యాలయాన్ని విభజించి, ఇక్కడ ఉన్న 50 మంది సిబ్బందిని నాలుగు జిల్లాల్లో సర్దుబాటు చేయాలి. మూడు జిల్లాల్లో ఆర్టీఏ కార్యాలయాల ఏర్పాటుకు డీటీసీ శివలింగయ్య ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేశారు. వరంగల్‌లోని ఉప రవాణాశాఖ భవనంలోనే తాత్కాలికంగా వరంగల్, హన్మకొండ జిల్లాల ఆర్టీఏ కార్యాలయాలు కొనసాగనున్నాయి. పై అంతస్తులో హన్మకొండ, గ్రౌండ్‌ఫ్లోర్‌లో వరంగల్ కార్యకలాపాలు సాగించనున్నారు. భూపాలపల్లిలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తుండ గా మహబూబాబాద్‌లో ఉన్న సబ్ కార్యాల యాన్ని జిల్లా కార్యాలయంగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఒక ఆర్టీఓ ఉండగా మ రో ముగ్గురు రానున్నారు. నాలుగు జిల్లాల్లో 84 మంది సిబ్బంది ఆవసరం. ప్రస్తుతం వరంగల్ ఆర్టీఏ పరిధిలో 50 మంది ఉన్నారు. మరో 34 పోస్టుల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఉన్న వారిలో 19 మందిని వరంగల్, 9 మంది హన్మకొండ, 12 మంది భూపాలపల్లి, 10 మందిని మహబూబాబాద్‌కు కేటాయించారు. జిల్లాలో ముగ్గురు ఎంవీఐలు ఉండగా వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లికి, ఏడుగురు ఏఎంవీఐలలో నలుగురు జిల్లా చెక్ పోస్ట్ వద్ద, మిగిలిన ముగ్గురిని వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్‌కు కేటాయించారు. ఇద్దరు పరిపాలన «అధికారులు ఉండగా భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు కేటాయించారు. జనగామలోని ఆర్టీఏ సబ్ కార్యాలయాన్ని యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వాహనదారుల సౌకర్యార్థం భూపాలపల్లి జిల్లా ఏర్పాటుకు ముందే అక్కడ సబ్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. మరో వారం రోజుల్లోనే ఆ కార్యాలయం ప్రారంభమయ్యే ఆవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. నాలుగు జిల్లాల పర్యవేక్షక అధికారిగా డీటీసీ.. వరంగల్ డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ కార్యాలయం యథావిధిగా కొనసాగనుంది. కొత్తగా ఏర్పడనున్న నాలుగు జిల్లాల పర్యవేక్షణ ఆధికారిగా డీటీసీ ఉండనున్నారు. ఆదేవి«««దlంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించనున్నట్లు తెలిసింది. -
జిల్లాలపై నిమిషానికో ఫిర్యాదు
-
జిల్లాలపై నిమిషానికో ఫిర్యాదు
- పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాల వెల్లువ - రెండో రోజున వెల్లువెత్తిన ఆన్లైన్ విజ్ఞప్తులు - యాదాద్రి, హన్మకొండ జిల్లాలపై అత్యధికం సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన ముసాయిదాపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సగటున నిమిషానికో విజ్ఞప్తి రావడం గమనార్హం. కొత్త జిల్లాల పునర్విభజనపై అభిప్రాయాల స్వీకరణకు ప్రభుత్వం ప్రారంభించిన వెబ్‌సైట్‌కు పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు, సలహాలు వస్తున్నాయి. మంగళవారం రాత్రి పది గంటల వరకు 40 వేల మందికిపైగా ఈ వెబ్‌సైట్‌ను వీక్షించగా.. 1,604 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటితో పాటు కలెక్టర్లకు, సీసీఎల్ఏకు నేరుగా సమర్పించిన ఫిర్యాదులు కలిపితే ఈ సంఖ్య మరింతగా ఎక్కువగా ఉండనుంది. వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం... ప్రతిపాదిత కొత్త జిల్లాలపై 988, కొత్త రెవెన్యూ డివిజన్లపై 388, కొత్త మండలాలపై 228 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. అందులో వరంగల్, నల్లగొండ జిల్లాలను విభజించిన తీరుపైనే ఎక్కువగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి 220 అర్జీలు దాఖలయ్యాయి. హన్మకొండ జిల్లాపై 169, వనపర్తి జిల్లాపై 116 అర్జీలు నమోదయ్యాయి. ఆచార్య జయశంకర్ జిల్లాపై 58, పెద్దపల్లి జిల్లాపై 56 అభ్యంతరాలు/విజ్ఞప్తులు ఉన్నాయి. నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి సలహాలు, సూచనలు తక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు కొత్తగా ప్రతిపాదించిన డివిజన్లపైనా అభ్యంతరాలు వచ్చాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసే డివిజన్లపై 216 ఫిర్యాదులు అందాయి. మండలాల వారి గా చూస్తే జగిత్యాల జిల్లాలో కలిపిన మండలాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సాగుతున్న మ్యాప్‌ల తయారీ జిల్లాల పునర్విభజన అంశంపై వివిధ రకాలుగా జిల్లాల మ్యాప్‌లను తయారు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. ముసాయిదా నోటిఫికేషన్‌కు అనుగుణంగా మ్యాప్‌లను మంగళవారం కూడా విడుదల చేయలేదు. తప్పులు దిద్దుతున్న రెవెన్యూశాఖ జిల్లాల పునర్విభజన ముసాయిదాలో దొర్లిన తప్పులను రెవెన్యూ శాఖ సవరిస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు రెండు సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జారీ చేసిన జీవో నం.372ను రహస్యంగా ఉంచిన రెవెన్యూ శాఖ.. జీవోల వెబ్సైట్లో దాన్ని ఖాళీగా ఉంచింది. హన్మకొండ, యాదాద్రి రెండింటిలోనూ పొందుపరిచిన దేవరుప్పుల మండలం విషయంలో అందులో స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ఇక ప్రతిపాదిత నాగర్‌కర్నూల్ జిల్లాలో చేర్చిన వంగూర్ మండలం నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్లో ఉన్నట్లుగా ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించింది. అయితే ఆ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న అచ్చంపేట రెవెన్యూ డివిజన్లో ప్రతిపాదించినట్లు మరో సవరణ(జీవో నం.373)లో స్పష్టం చేసింది. -
సంబరాలు అంబరాన్నంటాలి
టీఆర్ఎస్ జిల్లా చీఫ్ ‘తక్కళ్లపల్లి’ హన్మకొండ : గోదావరి నదీ జలాల వినియోగంపై మహారాష్ట్రతో నేడు ప్రభుత్వం చేసుకునే చారిత్రక ఒప్పందంతో పాటు జిల్లాల పునర్విభజన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన నేపథ్యంలో సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకోవాల ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షాభావంతో బీళ్లుగా మారుతున్న భూములను గోదావరి నదీ జలాల వినియోగంతో సాగులోకి తేవడానికి సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సర్కారు తరఫున సీఎం దేవేంద్ర పడ్నవీస్ మధ్య మంగళవారం(23న) మధ్యాహ్నం మూడు గంటలకు చారిత్రక ఒప్పందం జరగనుం దని చెప్పారు. ఈ గొప్ప కార్యక్రమంతో వరంగల్ జిల్లాయే ఎక్కువగా లబ్ధిపొందుతుందని, మహా రాష్ట్రతో చేసుకునే ఒప్పందంతో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తవుతాయని తెలిపారు. జిల్లాలోని కరువు ప్రాంతాలు సస్యశ్యాలం అయ్యేందుకు ఇది ఉపయోగడుతుందని చెప్పారు. ఈ ఒప్పందం జరగగానే.. జిల్లా అంత టా భారీగా సంబరాలు జరుపుకోవాలని టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 24న రాష్ట్రానికి వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివెళ్లాలని కోరారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలో పేర్కొన్న ప్రకారం జిల్లాల పునర్విభజన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా అంతటా సంబరాలు నిర్వహించాలని సూచరించారు. -
కొత్తగా 6 మండలాలు
వరంగల్ జిల్లాలోకి హసన్‌పర్తి, శాయంపేట హన్మకొండలోకి దేవరుప్పుల ముసాయిదాకు తుది రూపు సర్కారుకు నివేదించిన కలెక్టర్ కరుణ సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా(డ్రాఫ్ట్) నివేదికను జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఆదివారం సాయంత్రం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనకు సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరిచారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మండలం, డివిజన్, జిల్లా స్థాయి అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపి నివేదిక రూపొందించారు. కలెక్టర్ పంపిన నివేదికను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి, తుది మార్పులు చేయనుంది. పునర్విభజన ముసాయిదా ప్రకటనను సోమవారం జారీ చేయనుంది. కలెక్టర్ వాకాటి కరుణ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం రూపొందించిన నివేదికలో చివరి క్షణం వరకు మార్పు లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొత్త మండలాల్లో కలిపే గ్రామాలపై ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి. ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండేలా చూసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. మొదట రూపొందించేది ముసాయిదా నివేదికే కావడంతో అధికారులు సైతం ఈ విషయంలో కాస్త ఉదారంగానే వ్యవహరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం రూపొందించిన ముసాయిదా నివేదికలో రోజురోజుకు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించాలని నివేదికలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 51 మండలాలు ఉన్నాయి. కొత్తగా ఖిలావరంగల్(వరంగల్), కాజీపేట(హన్మకొండ), ఐనవోలు(వర్ధన్నపేట), వేలేరు(ధర్మసాగర్), చిల్పూరు(స్టేçÙన్‌ఘన్‌పూర్) మండలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న జమ్మికుంట... కొత్తగా ఏర్పడుతున్న హన్మకొండ జిల్లాలో కలవనుంది. జమ్మికుంటలోని ఇల్లందకుంటను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి వివరాలను మరోసారి పరిశీలించి జిల్లా యంత్రాంగం ఆదివారం తుది ముసాయిదా నివేదికను రూపొందించింది. శనివారం వరకు హన్మకొండ జిల్లాలో ఉన్న హసన్‌పర్తిని ఇప్పుడు వరంగల్ జిల్లాలోకి మార్చారు. అలాగే మొదట యాదాద్రి జిల్లాలో కలపాలని నివేదిక రూపొందించిన దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొన్నారు. మొదట వరంగల్ జిల్లాలో, తర్వాత భూపాలపల్లి జిల్లాలో కలపాలని పేర్కొన్న శాయంపేట మండలం తుది నివేదికలో వరంగల్ జిల్లాలోనే ఉంది. వరంగల్ జిల్లాలో 17, హన్మకొండ జిల్లాలో 19, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15, మానుకోట జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. కొత్తగా హన్మకొండ, హుజూరాబాద్, భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. తుది ముసాయిదాకు ప్రభుత్వ స్థాయిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ముసాయిదా నివేదికలోని వివరాలు ఇవీ... వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుకొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ. హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇలందకుంట(కొత్తది). ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవపూర్. మానుకోట : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సిం హులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం. యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం. సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. -
పట్టింపు లేదు
పరిపాలన సౌలభ్యం కోసమే హన్మకొండ ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు మన జిల్లా విభజనపై సీఎం కేసీఆర్ నేడు మండలాలపై స్పష్టత సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించే విషయంలో నెలకొన్న అయోమయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపడుతున్నామని, ప్రజల అభీష్టం మేరకే తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎక్కువ అంశాలపై వరంగల్ జిల్లా పునర్విభజన ప్రతిపాదనలనే ఉదహరించారు. ‘పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టాం. సగటున 16 మండలాలు ఉండాలని ప్రతిపాదించాం. వరంగల్ జిల్లాలో పునర్విభజనపై కొంత గందరగోళం ఉందని తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న భూపాలపల్లి జిల్లా... ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ జిల్లాతో సమానంగా ఉంది. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని మండలాలను మినహాయిస్తే 32 వరకు మండలాలు ఉంటున్నాయి. ఇన్ని మండలాలతో ఒక జిల్లా అంటే మళ్లీ పరిపాలన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అన్నీ పరిశీలించాకే వరంగల్, హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతవాసులు నగరంతోనే అనుసంధానమవుతారు. అందుకే వరంగల్ కేంద్రంగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. దీనివల్ల వరంగల్ నగరం ఉనికికి, అభివృద్ధికి ఏ ఇబ్బందీ ఉండదు. గ్రేటర వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలు... వరంగల్ నగర అభివృద్ధి, సేవల కల్పనను పర్యవేక్షిస్తాయి. పరిపాలన పరంగా రెండు జిల్లాలు ఉంటాయి. ఇవన్నీ ప్రజలు అంగీకరిస్తేనే. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై పట్టింపులేదు. ప్రజలు వద్దంటే ఒకే జిల్లాగా ఉంటుంది. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రజలు తమ ప్రతిపాదనలు ఇవ్వవచ్చు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వాఖ్యల నేపథ్యంలో ప్రజల అభిప్రాయం మేరకు హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఉండనుంది. హన్మకొండపై భిన్నాభిప్రాయాలు వరంగల్ జిల్లాలను నాలుగు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదనపై రాజకీయ నేతలు, ఉద్యోగులు, ప్రజల్లో గందరగోళం ఉంది. అని రాజకీయ పార్టీల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటు అవసరం లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పరకాలలో అభిప్రాయపడ్డారు. జిల్లాల పునర్విభజనలో మెుదటి ప్రతిపాదించిన వరంగల్ జిల్లా నుంచి హన్మకొండ జిల్లాగా విభజించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రకటించాయి. జిల్లా కేంద్రాన్ని రెండు జిల్లాలుగా విభజించడం సరికాదని పేర్కొన్నాయి. 22న ముసాయిదా విడుదల జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ప్రతిపాదనలు ఖరారయ్యాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలో 14 చొప్పున మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 16 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 12 మండాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లతో పాటు కొత్త మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ముసాయిదాను విడుదల చేయనుంది. అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు గడువు విధించనుంది. ఈ ప్రక్రియ తర్వాత తుది మార్పులు చేసి అక్టోబరు 11(దసరా) నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన మొదలుకానుంది. మండలాలపై నేడు స్పష్టత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో కొత్తగా ఎన్ని మండలాలు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్తగా ఎనిమిది మండలాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు పంపింది. ఖిలా వరంగల్(వరంగల్), కాజీపేట(హన్మకొండ), ఐనవోలు(వర్ధన్నపేట), వేలేరు(ధర్మసాగర్), చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్), టేకుమట్ల(చిట్యాల), ఇనుగుర్తి(కేసమద్రం), చిన్నగూడురు(మరిపెడ) మండలాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం కొత్తగా మార్గదర్శకాలు రూపొందించింది. పట్టణ ప్రాంతాల్లో 1.50 లక్షల జనాభా, గ్రామీణ ప్రాంతాల్లో 35 వేల జనాభా ఉండాలని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాలతో ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం మళ్లీ ప్రతిపాదనలు తయారు చేసి ఆదివారం ఉదయం 11 గంటల వరకు పంపించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ఆదేశించారు. కలెక్టర్ వాకాటి కరుణ జిల్లాలోని ఆర్డీవోలతో సమాచారం సేకరించి దీనిపై నివేదిక రూపొందించే పనిలో నిమగ్నయ్యారు. -
కొన్ని మార్పులు
జిల్లాల పునర్విభన ముసాయిదాకు తుదిరూపు వరంగల్, హన్మకొండలో 14 చొప్పున మండలాలు హన్మకొండ జిల్లాలోకి పాలకుర్తి, కొడకండ్ల జయశంకర్ జిల్లాలోకి శాయంపేట మహబూబాబాద్‌లోనే కొత్తగూడ కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లు సాక్షిప్రతినిధి, వరంగల్ : అన్ని వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. శనివారం హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో జిల్లాల పునర్విభజనపై ముసాయిదా సిద్ధమైంది. జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా ప్రతిపాదనలు రూపొందించారు. వరంగల్ జిల్లాను వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తుది ముసాయిదాలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 16 మండలాలతో వరంగల్ జిల్లాను, 12 మండలాలతో హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలని మొదట ప్రతిపాదనలు చేశారు. తాజా మార్పుల ప్రకారం... వరంగల్, హన్మకొండ జిల్లాల్లో 14 చొప్పున మండలాలు ఉంటున్నాయి. ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలోని మండలాల సంఖ్యలో మార్పేమీ జరగలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం శాయంపేట మండలం ఆచార్య జయశంకర్ జిల్లాలో కలవనుంది. వరంగల్ జిల్లాలో కొనసాగించాలని ఆ మండల ప్రజలు పోరాటాలు చేసినా ప్రతిపాదనల్లో మాత్రం దీనికి విరుద్ధంగానే ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల మండలాలను హన్మకొండ జిల్లాలో కలిపేలా, రాయపర్తి మండలాన్ని వరంగల్ జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్తగూడ మండలాన్ని మొదట పేర్కొనట్లుగా మహబూబాబాద్ జిల్లాలోనే కలపనున్నారు. జిల్లాల వారీగా మండలాలు... వరంగల్ జిల్లా : వరంగల్, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, రాయపర్తి. హన్మకొండ జిల్లా : హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపురం. ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం. మహబూబాబాద్ : డోర్నకల్, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, గూడురు, కొత్తగూడ, బయ్యారం, గార్ల. యాదాద్రి జిల్లా : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట. సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఇలా.. ప్రతిపాదిత నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. భూపాలపల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితమే ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూపాలపల్లి కేంద్రంగా ఆచార్య జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. దీంతో భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటోంది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటును ముసాయిదాలో పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న హన్మకొండ జిల్లాలో హన్మకొండ, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానున్నాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు... నర్సంపేట : నెక్కొండ, పరకాల, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట. వరంగల్ : ఆత్మకూరు, గీసుగొండ, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, వరంగల్, వర్ధన్నపేట. హుజూరాబాద్ : భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపురం. హన్మకొండ : రఘునాథపల్లి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, హసన్‌పర్తి, జఫర్‌గఢ్, కొడకండ్ల, పాలకుర్తి, నర్మెట. భూపాలపల్లి : కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం, భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి. ములుగు : ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం. మహబూబాబాద్ : బయ్యారం, గార్ల, డోర్నకల్, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, గూడురు, కొత్తగూడ. జనగామ : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట, ఆలేరు, గుండాల, మోటకొండూరు(న్యూ), రాజాపేట, అడ్డగూడురు(న్యూ), మోత్కూరు. -
నాలుగు జిల్లాలుగా వరంగల్
12 మండలాలతో హన్మకొండ జిల్లా చారిత్రక నగరం రెండుగా విభజన అన్ని వర్గాల్లో అయోమయం డ్రాఫ్టు నోటిఫికేషన్‌పై ఉత్కంఠ సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై స్పష్టత వచ్చినట్లే వచ్చి మరింత గందరగోళంలో పడింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కొన్ని నెలలుగా వస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోగా.. ఎవరూ డిమాండ్ చేయకుండానే హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ముసాయిదా నోటిఫికేషన్ రూపకల్పన దాదాపు పూర్తయింది. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ముసాయిదా రూపొందించారు. జనాభా ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జనాభాను ఆధారంగా చేసుకుని కొత్తగా హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనను రూపొందించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం వరంగల్ జిల్లాలో 16 మండలాలు, హన్మకొండ జిల్లాలో 12 మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 16 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 12 మండలాలు ఉంటున్నాయి. మూడు నుంచి నాలుగుకు ప్రభుత్వం జూన్ మొదటి వారంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియను మొదలుపెట్టింది. వరంగల్ జిల్లాలను వరంగల్, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా విభజిస్తున్నట్లు అప్పుడు ప్రతిపాదనలు రూపొందించింది. వరంగల్ జిల్లాలో 28 మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 13 మండలాలు ఉండేలా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. జనగామ జిల్లా చేయాలని కొనసాగుతున్న డిమాండ్‌ను పట్టించుకోలేదనే అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో నెలకొంది. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం... అన్ని జిల్లాల ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. జనగామ జిల్లా చేయాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టి.రాజయ్య మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. ముసాయిదా ప్రకటనలో జనగామ జిల్లా అంశం ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశించారు. ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నది. బుధవారం ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం... మన జిల్లాను నాలుగు జిల్లాలు విభజించేలా ప్రతిపాదనలను రూపొందించింది. జనగామ జిల్లా అంశాన్ని ప్రతిపాదనల్లో పేర్కొనలేదు. వరంగల్ జిల్లాలో కొత్తగా హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తయారు చేసింది. మొదట రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం... వరంగల్ జిల్లాలో 28 మండలాలు ఉండాలని పేర్కొంది. తాజాగా నాలుగు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదన నేపథ్యంలో వరంగల్‌కు 16 మండలాలను, హన్మకొండకు 12 మండలాలను కేటాయిస్తూ జాబితా రూపొందించింది. ఏ ఒక్కరూ కోరని, ఎవరూ అడగని హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రస్తావన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం హన్మకొండ జిల్లా ప్రతిపాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యోగ వర్గాలు, ప్రజల్లోనూ ఈ విషయంపై గందరగోళం నెలకొంది. తుది జాబితాలో హన్మకొండ జిల్లాకు చోటు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జనగామలో మార్పు లేదు... జనగామ జిల్లా ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని తాజా ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. జనగామ నియోజకవర్గంలోని ఐదు మండలాల విషయంలోనూ కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదు. మొదటి ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లుగానే ఈ సెగ్మెంట్లోని ఐదు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో కలుపుతున్నారు. జనగామ, బచ్చన్నపేట మండలాలను యాదాద్రి(భువనగిరి) జిల్లాలో... చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేట జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. దేవరుప్పులు, లింగాలగణపురం మండలాలను సైతం యాదాద్రి జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రెండుమూడు రోజుల్లో వెల్లడించే ముసాయిదా నోటిఫికేషన్‌తో ప్రస్తుత గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది. జిల్లాల వారీగా మండలాలు ఇలా... వరంగల్ జిల్లా : వరంగల్, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, పాలకుర్తి, రాయపర్తి, శాయంపేట. హన్మకొండ జిల్లా : హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హూజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్. ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కొత్తగూడ, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం. మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, కొడకండ్ల, గార్ల, బయ్యారం. యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. ప్రతిపాదిత జిల్లాల వారీగా గణాంకాలు... జిల్లా పేరు మండలాలు జనాభా విస్తీర్ణం(చదరపు కిలో మీటర్లు) వరంగల్ 16 11,26,096 2638.50 హన్మకొండ 12 11,52,579 2481.06 ఆచార్య జయశంకర్ 16 6,95,145 6032.65 మహబూబాబాద్ 12 7,54,845 3463.89 -
నేడు కీలక భేటీ
సాక్షిప్రతినిధి నిజామాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మంత్రి వర్గ ఉప సంఘం భేటీకానుంది. ఇందులో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చర్చించనున్నారు. ఇదివరకే నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి పలు అంశాలను జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారు. కొత్త మండలాల ఏర్పాటు, ప్రాంతాలు, అధికారులు, ఉద్యోగుల విభజన తదితర విషయాలను చర్చించనున్నారు. ఇదివరకే జిల్లా కలెక్టర్ యోగితారాణా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా నివేదికపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పెద్దగా ఎదురయ్యే ఆటంకాలు లేవని చెప్పుకోవాలి.అయితే మండలాల ఏర్పాటు ప్రాంతాల విభజనకు సంబంధించి కొన్ని వినతులను, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని చర్చించనున్నారు. జిల్లాలో కొత్తగా 10 మండలాలు పెరుగనున్నాయి. కొత్త మండలాల విలీనంపై స్పష్టత వచ్చింది. 25 మండలాలతో నిజామాబాద్, 21 మండలాలతో కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని నాగిరెడ్డిపేట మండలంను మెదక్ జిల్లాలో కలుపుతున్నట్లు ప్రచారం జరిగింది. కొత్తగా కామారెడ్డిలో మరో మండలం ఏర్పాట్లు అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా బాన్సువాడ నియోజక వర్గ పరిధిలోని కోటగిరి, వర్ని మండలాలు నిజామాబాద్ జిల్లాలో కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించే అవకాశం ఉంది. ఇదివరకే మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ రెండు మండలాలను నిజామాబాద్ జిల్లాలో కలుపనున్నట్లు హామీ ఇచ్చారు. అయినా మంత్రి వర్గ ఉపసంఘం కీలక సమావేశం కాబట్టి ఇందులోనే ఈ రెండు మండలాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం మేరకు రెండు జిల్లాల్లో మార్పులు, చేర్పులు ఏ విధంగా ఉంటాయోనని ఈ సమావేశంలో తేలనున్నది. కొన్ని రోజులుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఏర్పాటుపై సందేహాలకు సైతం ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని అంశాలు.. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఉద్యోగుల విభజన, తాత్కాలిక ఏర్పాట్లు, వసతి, మౌలిక ఏర్పాట్లు, జోనల్ శాఖల పునర్వ్యవస్థీకరణ పై ఈ కమిటీ చర్చించనుంది. ముసాయిదాకు ముందే దీనిపై తుది నిర్ణయం తీసుకొని నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో పునర్విభజన ప్రక్రియకు సంబంధించి నివేదికలను మంత్రి వర్గ ఉపసంఘం పరిశీలించనుంది. అలాగే మంత్రి, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, పోలీసు శాఖకు సంబంధించి అభిప్రాయాలను పరిశీలించనున్నారు. ఇదివరకే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కార్యాలయాల ఏర్పాటు, పరిపాలనకు సంబంధించి భవనాల పరిశీలన చేశారు. కార్యాలయాలకు భవనాలను కూడా ఎంపికచేశారు. జిల్లా పరిపాలన వ్యవస్థ పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించి అన్ని వివరాలను ఇదివరకే జిల్లా కలెక్టర్ యోగితారాణా నివేదిక సమర్పించారు. ఈ నివేదికను కూడా మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేయనుంది. అలాగే కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ అర్బన్, రూరల్‌లో రుద్రుర్, కామారెడ్డి అర్బన్‌లో తోడు ఆలూరు, భిక్కనూరు మండలం రాజాంపేట, దోమకొండ మండలం బీబీపేటలు మండలాలుగా ఏర్పడే అవకాశం ఉంది. దీనికి తోడు డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి కొత్త మండలం ఏర్పాటుపై పరిశీలించనున్నారు. జనాభా ప్రతిపాదికన కూడా విభజన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈనెల 22న ముసాయిదాలో తుది నిర్ణయం తీసుకొని నివేదిక పొందుపరచనున్నారు. అందుకుగాను నేడు కీలక సమావేశం జరుగనుంది. జిల్లా కలెక్టర్ యోగితారాణా, ఎస్పీ విశ్వప్రసాద్ సైతం ఈ సమావేశంలో పాల్గొని నివేదికలు ఇవ్వనున్నారు. నేడు సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా జరుగుతున్న పునర్విభజన సందేహాలకు బ్రేక్‌పడనుంది. మంత్రి వర్గ ఉపసంఘం నిజామాబాద్‌లోని కొత్త జిల్లాల ఏర్పాటుపై నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దీంతో దసరా నుండి కొత్త జిల్లాలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.