మార్పు, చేర్పులకు నో ఛాన్స్
హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవన్యూ డివిజన్లు, మండలాలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయని తెలిపింది. ప్రజల విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించింది. ఇకపై జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన కేంద్రాల నుంచే పాలన జరుగుతుందని పేర్కొంది.
కొత్త డిమాండ్లను పరిశీలించే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. మార్పు, చేర్పులకు అవకాశం లేదని తెలంగాణ సర్కారు వెల్లడించింది. కాగా, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగలేదన్న వాదనలు ఇంకా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. దసరా సందర్భంగా మంగళవారం తెలంగాణలో 21 కొత్త జిల్లాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.