telangana new districts
-
నయా పరిషత్‌లు
మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా మండల, జిల్లా ప్రాదేశిక స్థానాల ఖరారు ప్రక్రియను ప్రారంభించింది. జూలై 4, 5 తేదీలతో ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగుస్తున్నందున ఆ లోపు కొత్త జిల్లాల ప్రాతిపదికన వీటికి ఎన్నికలు నిర్వ హించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఈ మేరకు రెవెన్యూ జిల్లా పరిధిలోకి వచ్చే మండలాల జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నెల 25వ తేదీలోపు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 2016లో జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించింది. రంగారెడ్డికి అదనం గా మేడ్చల్, వికారాబాద్‌ను నూతనంగా ఏర్పాటు చేసింది. అయితే, అప్పట్లో పంచాయతీరాజ్ విభాగాన్ని పునర్విభజన నుంచి మినహాయించింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జిల్లాపరిషత్ కొనసాగుతోంది. మరికొన్ని నెలల్లో జెడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తికానున్నందున కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీలను కూడా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల డీలిమిటేషన్‌కు ముందు మన జిల్లాపరిషత్ పరిధిలో 33 మండల పరిషత్‌లు ఉండగా.. పునర్విభజన అనంతరం ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కేవలం 21 మండల పరిషత్‌లే ఉన్నాయి. వాస్తవానికి జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉన్నా.. అందులో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, గండిపేట మండలాలు ఆర్బన్ మండలాలు. ఇవి పంచాయతీరాజ్ నుంచి డీనోటిఫై అయ్యి.. పురపాలన పరిధిలోకి చేరాయి. గండిపేట మండలంలోని పంచాయతీలను కూడా పురపాలనలో విలీనం చేసినప్పటికీ, ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి యథాతథ పరిస్థితి కొనసాగుతోంది. ఈ మండలాలను మినహాయిస్తే గ్రామీణ మండలాలకు కొత్తగా ఎంపీపీ, జెడ్పీటీసీలు రానున్నారు. రాక..పోక జిల్లాల పునర్విభజన అనంతరం కొత్తగా ఏర్పడ్డ వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలు మండలాలు విలీనమయ్యాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోకి పరిగి, కుల్కచర్ల, దోమ, పూడూరు, నవాబ్‌పేట, వికారాబాద్, ధారూర్, మోమిన్‌పేట, మర్పల్లి, బంట్వారం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలు చేరాయి. గండీడ్ మండలం మహబూబ్‌నగర్‌లో విలీనమైంది. ఇక మేడ్చల్ జిల్లాలో ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, మేడ్చల్ కలిశాయి. కాగా, మహబూబ్‌నగర్ నుంచి కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాలు వికారాబాద్‌లోకి వచ్చాయి. ఇక మేడ్చల్‌లో మాత్రం పాత జిల్లాలోని మండలాలే కలిసాయి. రంగారెడ్డి జిల్లాలోకి పాలమూరు నుంచి ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల, కొందుర్గు, చౌదరిగూడ, కొత్తూరు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, నందిగామ విలీనమయ్యాయి. -
కొత్త జిల్లాల్లో విధుల్లో చేరిన డీఈవోలు
అధికారుల జాబితాలో 19 మంది స్థానాల మార్పు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో విద్యాశాఖ అధికారులుగా (డీఈవో) నియమితులైన వారంతా విధుల్లో చేరారు. ఈ జిల్లాలకు గాను డీఈవోలుగా విద్యాశాఖ అధికారులు తొలుత రూపొందించిన జాబితాలోని 19 మంది అధికారుల స్థానాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మార్చేశారు. మార్పు చేసిన జాబితాలోని అధికారులకు ఆర్డర్లు ఇవ్వడంతో వారంతా మంగళవారం విజయదశమి రోజున విధుల్లో చేరారు. ‘ఆరోపణలు ఉన్న వారికి అందలం’ శీర్షికన ఈనెల 10వ తేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. వెనువెంటనే విద్యాశాఖ అధికారులను పిలిపించుకుని జాబితాలో మార్పులు చేశారు. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు మొదటి జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి వంటి కీలకమైన జిల్లాలను కేటాయించగా, కడియం శ్రీహరి వారికి చెక్ పెట్టి, మార్పులు చేశారు. నల్లగొండ మినహా ఇతర పాత జిల్లాల్లో డీఈవోలుగా పని చేస్తున్న అధికారులను మార్చేశారు. కొత్తగా నియమితులైన డీఈవోలకు, ఆర్జేడీలకు ఈ నెల 15,16వ తేదీల్లో అవగాహన తరగతులను నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ తెలిపారు. మార్పుల ప్రకారం కొత్త జిల్లాల్లో డీఈవోలుగా విధుల్లో చేరిన వారు వీరే.. ఆదిలాబాద్: కె.లింగయ్య (నిజామాబాద్ డీఈవో), నిర్మల్: టి.ప్రణీత (ఏడీ ఆదిలాబాద్), మంచిర్యాల: రవికాంత్‌రావు (ఎస్సీఈఆర్టీ లెక్చరర్), కొమురంభీం (ఆసిఫాబాద్): అబ్దుల్ రఫీఖ్ (ఏడీ నిజామాబాద్), కరీంనగర్: పి.రాజీవ్ (వరంగల్ డీఈవో), జగిత్యాల: వెంకటేశ్వర్లు (హైదరాబాద్ డిప్యూటీఈవో), రాజన్న (సిరిసిల్ల): రాధాకిషన్ (సీటీఈ వరంగల్ లెక్చరర్), పెద్దపల్లి: వెంకటేశ్వర్రావు (ఏడీ కరీంనగర్), వరంగల్ అర్బన్: ఎస్.శ్రీనివాసాచారి (కరీంనగర్ డీఈవో), వరంగల్ రూరల్: నారాయణరెడ్డి (ఎస్సీఈఆర్టీ లెక్చరర్), మహబూబాబాద్: డి.వాసంతి (డిప్యూటీఈవో వరంగల్), జనగాం: ఎస్. యాదయ్య (ఏడీ వరంగల్), జయశంకర్ (భూపాలపల్లి): సహదేవుడు (వరంగల్ సీటీఈ ప్రిన్సిపల్), ఖమ్మం: విజయలక్ష్మీబాయి (మహబూబ్‌నగర్ డీఈవో), భద్రాద్రి (కొత్తగూడెం): హయగ్రీవాచారి (హైదరాబాద్ ఆర్జేడీ ఆఫీస్ ఏడీ), నల్లగొండ: వై.చంద్రమోహన్ (నల్లగొండ డీఈవో), సూర్యాపేట్: బీవీ నర్సమ్మ (ఖమ్మం డిప్యూటీఈవో), యాదాద్రి: రోహిణి (డిప్యూటీఈవో రంగారెడ్డి.), నిజామాబాద్: ఎన్.రాజేశ్ (ఖమ్మం డీఈవో), కామారెడ్డి: మదన్మోహన్ (డిప్యూటీఈవో భువనగిరి), మహబూబ్‌నగర్: సోమిరెడ్డి (హైదరాబాద్ డీఈవో), నాగర్‌కర్నూల్: జనార్దన్‌రావు (ఏడీ మహబూబ్‌నగర్), వనపర్తి: సుశీంద్రరావు (డిప్యూటీఈవో హైదరాబాద్), జోగుళాంబ (గద్వాల): పి.వేణుగోపాల్ (సీటీఈ వరంగల్ లెక్చరర్), మెదక్: రేణుకాదేవీ (డిప్యూటీఈవో వరంగల్), సిద్ధిపేట్: కృష్ణారెడ్డి (ఏడీ రంగారెడ్డి), సంగారెడ్డి: చంద్రకళ (డిప్యూటీఈవో రంగారెడ్డి), హైదరాబాద్: జి.రమేష్ (రంగారెడ్డి డీఈవో), రంగారెడ్డి: సత్యనారాయణరెడ్డి (ఆదిలాబాద్ డీఈవో), మేడ్చల్: ఉషారాణి (డిప్యూటీఈవో రంగారెడ్డి), వికారాబాద్: దీపిక (ఎస్సీఈఆర్టీ లెక్చరర్). ∙బ్రాకెట్లో ఉన్నది పాత స్థానం -
మార్పు, చేర్పులకు నో ఛాన్స్
-
మార్పు, చేర్పులకు నో ఛాన్స్
హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవన్యూ డివిజన్లు, మండలాలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయని తెలిపింది. ప్రజల విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించింది. ఇకపై జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన కేంద్రాల నుంచే పాలన జరుగుతుందని పేర్కొంది. కొత్త డిమాండ్లను పరిశీలించే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. మార్పు, చేర్పులకు అవకాశం లేదని తెలంగాణ సర్కారు వెల్లడించింది. కాగా, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగలేదన్న వాదనలు ఇంకా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. దసరా సందర్భంగా మంగళవారం తెలంగాణలో 21 కొత్త జిల్లాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
31 జిల్లాలుగా మారిన సరికొత్త తెలంగాణ
-
31 జిల్లాల సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం
-
31 జిల్లాల సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం
తెలంగాణలో సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు 10 జిల్లాలు మాత్రమే ఉన్న రాష్ట్రంలో సరికొత్తగా మరో 21 జిల్లాలు ఏర్పడ్డాయి. సిద్దిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆవిష్కరించారు. ఉదయం 10.25 గంటలకు బయల్దేరి, 11 గంటల సమయంలో సిద్దిపేట చేరుకున్న ఆయన.. అక్కడ కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక కలెక్టరేట్‌నే కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.45 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మర్కూక్ మండల కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక కొత్తగా ఏర్పాటుచేసిన మిగిలిన 20 జిల్లాలను పలువురు మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ప్రారంభించారు. -
గద్వాల పేరును అంగీకరించం: ఎమ్మెల్యే
హైదరాబాద్: గద్వాల జిల్లాకు జోగులాంబ పేరు పెట్టాలని మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. గద్వాల పేరును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని హైపవర్ కమిటీకి వివరించామని చెప్పారు. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై కె. కేశవరావు నాయకత్వంలో నియమించిన హైపవర్ కమిటీతో పలు జిల్లాల నాయకులు సమావేశమయ్యారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నాయకులు హైపవర్ కమిటీకి తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలిపారు. జనగామ జిల్లా ఏర్పాటుపై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చర్చించారు. మంత్రి కేటీఆర్, ఎంపీ బాల్క సుమన్ సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై హైపవర్ కమిటీతో సంప్రదింపులు జరిపారు. -
ఆ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నాం: కేసీఆర్
హైదరాబాద్: జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త జిల్లా ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని చెప్పారు. దసరా రోజు నుంచే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని ఆదేశించారు. సిద్ధిపేటలో పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కరీంనగర్, నిజామాబాద్ తో పాటు సిద్ధిపేట కమిషనరేట్ ప్రతిపాదనను వెంటనే రూపొందించాలన్నారు. యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీసు కమిషనరేట్ లోకి, జనగామ జిల్లాను వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి తేవాలని సలహాయిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని తాండూరును రెవెన్యు డివిజన్లుగా మార్చాలని అన్నారు. మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్ తో పాటు చేవెళ్ల మండలాన్ని శంషాబాద్ జిల్లాలో చేరుస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లాలోనే నాగిరెడ్డిపేట మండలాన్ని ఉంచాలన్నారు. ముథోల్ నియోజకవర్గంలోని భైంసాలో రెవెన్యు డివిజన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్, మనోహరాబాద్.. నిజామాబాద్ జిల్లాలోని చందూరు, ములుగు నియోజకవర్గంలోని కన్నాయిగూడెం, నిర్మల్ అర్బన్, రూరల్ మండలాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. -
కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పరిణామాలు!
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివాదస్పద అంశాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గద్వాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా సానుకూలత వచ్చినట్టు సమాచారం. ఆయా జిల్లాల నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. ప్రజలు కోరుకునేవిధంగా జిల్లాలు ఏర్పాటు చేద్దామని, వ్యక్తిగత ప్రతిష్టలకు పోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. జనాభా ప్రతిపాదికన మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగో జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉందా అనే విషయంపై సీఎం ఆరా తీసినట్టు సమాచారం. జనగామ, సిరిసిల్ల జిల్లాల డిమాండ్ ను కూడా సానుకూలంగా పరిష్కరించేలా ఆయ జిల్లాల నాయకులతో ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల వారీగా కేసీఆర్ ఆదివారం సమీక్షలు నిర్వహించారు. నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు అనంతగిరిగా నామకరణం చేయాలని రంగారెడ్డి నేతలు సూచించారు. శంకరపల్లి, మొయినాబాద్, చేవెళ్లను శంషాబాద్ జిల్లాలో కలపాలని కోరారు. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నాయకులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పరిణామాలు!
-
డీకే అరుణ దీక్ష.. ఓ డ్రామా
-
డీకే అరుణ దీక్ష.. ఓ డ్రామా
జిల్లాల కోసం డీకే అరుణ చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ కోసం ఆమె ఎలాంటి ఉద్యమాలు చేయలేదని అన్నారు. గద్వాలను జిల్లా చేయాలని ప్రజలు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని జూపల్లి చెప్పారు. రాజకీయాల కోసం ఇప్పుడు జిల్లాల విభజన జరగడం లేదని, కేవలం పరిపాలన పరమైన సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాలను విభజిస్తున్నామని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. -
జిల్లాల జగడం
-
వరంగల్ విభజన ఎందుకు: కోదండరామ్
కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఐదో షెడ్యూలులోని ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటినీ ఒకే జిల్లాలో ఉంచాలని కోరారు. వరంగల్‌ను రెండు జిల్లాలుగా విభజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలపాలని ఆయన అన్నారు. గద్వాల, జనగామ ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని తెలిపారు. ఇక మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకోవాలనుకుంటున్న ఒప్పందం మంచిదే గానీ, ఆ ఒప్పందం వివరాలేంటో బహిర్గతం చేయాలని కోరారు. అలాగే... ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ డైరీలో ఉన్న వివరాలు అన్నింటినీ కూడా బయటపెట్టాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. -
కొత్త జిల్లాలపై భారీగా అభ్యంతరాలు
తెలంగాణలో కొత్త జిల్లాల ముసాయిదాపై వివిధ వర్గాల ప్రజల నుంచి భారీగా అభ్యంతరాలు సూచనలు వచ్చాయి. ఒక్కరోజులోనే తెలంగాణ ప్రభుత్వానికి సుమారు 555 విజ్ఞప్తులు అందాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాల ఏర్పాటుపై 333, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై 113, మండలాల ఏర్పాటుపై 109 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. జిల్లాల వారీగా అందిన సూచనలు ఇలా ఉన్నాయి... -
ప్రజలే ఫైనల్!
27 జిల్లాలతో ముసాయిదా అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు సెప్టెంబర్ 20 వరకు గడువు ► జిల్లా కలెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయంలో సూచనల స్వీకరణ ►ఆన్‌లైన్‌లోనూ వెల్లడించే అవకాశం.. అందుబాటులో ప్రత్యేక వెబ్సైట్ ► కొత్తగా 17 జిల్లాలు.. 15 రెవెన్యూ డివిజన్లు ► మొత్తం 505 మండలాలు.. కొత్తగా 46 ఏర్పాటు ► నేడు జిల్లాల రూపురేఖలతో జీఐఎస్, డిజిటల్ మ్యాపుల విడుదల ►మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకే ► జిల్లాల ఏర్పాటు: మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్ జిల్లాల పునర్విభజనలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే అంతిమమని.. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 27 జిల్లాలతో కూడిన ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. తాము ఏ జిల్లా, మండలంలో ఉండాలనుకుంటున్నారో ప్రజలు అభ్యర్థించవచ్చని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయంతోపాటు ఆన్‌లైన్‌లోనూ అభిప్రాయాలను వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు కొత్త జిల్లాల ముసాయిదాను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్ఏ రేమండ్ పీటర్లతో కలసి డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘జిల్లాల పునర్విభజన ముసాయిదా ప్రకటనను విడుదల చేశాం. ముఖ్యమంత్రి, అధికారులు తీవ్ర కసరత్తు చేసి ముసాయిదాను రూపొందించారు. ప్రజల సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు.. రాజకీయ పార్టీలు, నాయకుల కోసం కాదు. ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణ కోసం 30 రోజుల సమయం కేటాయించాం. ఈ ముసాయిదాయే ఫైనల్ కాదు.. ప్రజలే ఫైనల్. మెజారిటీ ప్రజలు.. 51 శాతంపైగా మంది ఏం చెబితే అదే చేస్తాం..’’ అని మహమూద్ అలీ పేర్కొన్నారు. ప్రజల సలహాలు, అభ్యంతరాలే కీలకమని చెప్పారు. కొత్త జిల్లాల ముసాయిదాపై అన్ని జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయంలో అభ్యంతరాలు, సలహా లను తెలపవచ్చని.. అందుకోసం కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక http://newdistrictsformation.telangana. gov.in వెబ్సైట్లోనూ అభ్యంతరాలు, సూచనలను వెల్లడించవచ్చని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ ముగిశాక.. మళ్లీ అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి మరోసారి వారి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ముసాయిదా ప్రకటన జారీ చేసిన సోమవారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే... సెప్టెంబర్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు తెలిపేందుకు అవకాశం ఉండనుంది. ప్రజల అభీష్టం మేరకే.. ఉద్యమ కాలంలో కేసీఆర్ గ్రామ గ్రామాలకు తిరిగినప్పుడు.. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు 100 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లాల్సి వస్తోందని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేసేవారని మహమూద్ అలీ చెప్పారు. అందుకే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్త జిల్లాల ఏర్పాటు హామీని చేర్చారన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలు చాలా పెద్దగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. చిన్న జిల్లాలతో పరిపాలన మెరుగుపడుతుందని చెప్పారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్ఏ రేమండ్ పీటర్, జిల్లా కలెక్టర్లు రాత్రింబవళ్లు శ్రమించి ముసాయిదాకు తుది రూపు ఇచ్చారని తెలిపారు. నేడు మ్యాపుల విడుదల ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కోసమే నిబంధనల మేరకు ముసాయిదా ప్రకటన జారీ చేశామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రదీప్ చంద్ర చెప్పారు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోయినా... మెజారిటీ ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంగళవారం సాయంత్రంలోగా వెబ్సైట్లో కొత్త జిల్లాల ముసాయిదాకి సంబంధించిన జీఐఎస్ మ్యాపులు, డిజిటల్ మ్యాపులను అందుబాటులో ఉంచుతామని సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. జిల్లాల పునర్విభజన ముసాయిదాలోని ముఖ్యాంశాలు మొత్తం జిల్లాలు : 27 కొత్తగా ఏర్పాటయ్యేవి : 17 మొత్తం రెవెన్యూ డివిజన్లు : 60 కొత్తగా ఏర్పాటయ్యే డివిజన్లు : 15 మొత్తం మండలాలు : 505 కొత్తగా ఏర్పాటయ్యే మండలాలు : 46 కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు 1. ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి) 2. హన్మకొండ 3. జగిత్యాల 4. కామారెడ్డి 5. కొమురం భీం (మంచిర్యాల) 6. కొత్తగూడెం 7. మహబూబాబాద్ 8. మల్కాజ్గిరి 9. నాగర్ కర్నూల్ 10. నిర్మల్ 11. పెద్దపల్లి 12. సంగారెడ్డి 13. శంషాబాద్ 14. సిద్దిపేట 15. సూర్యాపేట 16. వనపర్తి 17. యాదాద్రి కొత్తగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు 1. బెల్లంపల్లి 2. భైంసా 3. కోరుట్ల 4. హన్మకొండ 5. హుజూరాబాద్ 6. భూపాలపల్లి 7. వైరా 8. కోదాడ 9. అచ్చంపేట 10. కీసర 11. తూప్రాన్ 12. జహీరాబాద్ 13. గజ్వేల్ 14. నారాయణఖేడ్ 15. బాన్సువాడ కొత్తగా ఏర్పాటు చేసే మండలాలు – ఆదిలాబాద్ జిల్లాలో మావల, నస్పూర్ – కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, అంతర్గాం, ఇల్లంతకుంట – వరంగల్ జిల్లాలో ఖాజీపేట, చిల్పూర్, వేలేరు, ఇల్లందకుంట, ఖిల్లా వరంగల్, ఐనవోలు – నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, మాడ్గులపల్లి, తిరుమలగిరి (సాగర్), కొండమల్లెపల్లి, నాగారం, అనంతగిరి, మోటకొండూరు, అడ్డగూడూరు – మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్ రూరల్, రాజాపూర్, మరికల్, పదర, అమరచింత, నందిన్నె – రంగారెడ్డి జిల్లాలో దుండిగల్, జవహర్‌నగర్, అబ్దుల్లాపూర్, బాలాపూర్, గండిపేట్ – మెదక్ జిల్లాలో సిర్గాపూర్, అమీన్పూర్, గుమ్మడిదల, సిద్దిపేట రూరల్, రాజంపేట్ – నిజామాబాద్ జిల్లాలో రామారెడ్డి, నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, ముగ్పాల్, ఇందల్వాయి, ఆలూర్, మెండోరా, రుద్రూరు – ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, చిన్నంబావి